కొరటాల శివ కు దెబ్బ మీద దెబ్బ.. ఎన్టీఅర్ అలా చేస్తున్నాడా..!!

P.Nishanth Kumar
కొరటాల శివ టైమ్ గత కొంతకాలంగా ఏ మాత్రం బాగోలేదని చెప్పాలి. మూడేళ్లుగా ఆయన ఒకే ఒక సినిమాపై పనిచేస్తూ తన అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తున్నారు. భారీ స్థాయి మాస్ మసాలా చిత్రాలను తెరకెక్కించి భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుని ప్రేక్షకులను ఎంతగానో అలరించిన కొరటాల శివ మూడు సంవత్సరాలుగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమానే నమ్ముకున్నాడు. అంతకు ముందు ఆయన చేసిన సినిమాలు అతి తక్కువ సమయంలో చిత్రీకరించబడి విడుదల అయ్యాయి.

కానీ ఏ ముహూర్తాన చిరంజీవి సినిమాను ఒప్పుకున్నాడో తెలియదు కానీ ఆ సినిమా పూర్తయ్యి సంవత్సరకాలం దాటుతున్న కూడా దాన్ని విడుదల చేయకపోవడం ఆయనకు తీరని మనోవేదన కలిగిస్తుందట. దానికి కారణం ఏదైనా కూడా ఇంతటి సమయాన్ని కేటాయించడం నిజంగా కొరటాల శివ అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. ఇంకొకవైపు ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్న ఇద్దరు హీరోలు వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. కొరటాల మాత్రం ఈ సినిమాను విడుదల చేసిన తర్వాతనే తన తదుపరి సినిమాను మొదలు పెట్టాలని భావిస్తున్నారు.

ఆ విధంగా ఎన్టీఆర్ తో కలిసి ఆయన చేయబోయే 31 సినిమా వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఎన్టీఆర్ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను మరో రెండు నెలలు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఆచార్య సినిమా విడుదల కాగానే వెంటనే ఈ సినిమాను మొదలు పెట్టాలని ఆయన భావించాడు. కానీ ఆర్.ఆర్.ఆర్ తో బాగా అలసి పోయిన ఎన్టీఆర్ ఓ మూడు నెలలు హాలిడే కి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. దాంతో ఎన్టీఆర్ విశ్రాంతి కోసం మూడు నెలలు వెళ్లడం అందుబాటులో లేకపోవడం కొరటాల శివ సినిమా మరి కొన్ని రోజులు పోస్ట్పోన్ కావడం జరుగుతుంది అని అంటున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: