మహేష్ సినిమా కథ పై అభిమానులలో సందేహాలు !

Seetha Sailaja

‘ఆర్ ఆర్ ఆర్’ ఫలితం తేలిపోయింది. ఈమూవీ ఫైనల్ రన్ పూర్తి చేసుకునేసరికి 1000 కోట్ల కలక్షన్ ఫిగర్ ను అందుకోవడం కష్టం అన్న సంకేతాలు వచ్చేస్తున్నాయి. దీనికితోడు ఈమూవీ కలక్షన్స్ విషయంలో వాస్తవాలు బయటకు రావడం లేదని ఫేక్ ఫిగర్స్ హడావిడి మాత్రమే కనిపిస్తోంది అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు.


సాధారణంగా ఫాల్స్ ప్రచారానికి దూరంగా ఉండే రాజమౌళి కూడ ‘ఆర్ ఆర్ ఆర్’ కలక్షన్స్ విషయంలో మౌనం వహిస్తూ ఉండటం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ‘ఆర్ ఆర్ ఆర్’ అలసట నుండి తేరుకుని జక్కన్న తన కుటుంబ సభ్యులతో యూరప్ వెళ్ళి వచ్చిన తరువాత మహేష్ తో తీయబోయే సినిమా గురించి క్లారిటీ ఇస్తాడని భావిస్తున్నాడు. వాస్తవానికి ఒక సినిమా మొదలుపెట్టే ముందు రాజమౌళి తన సినిమా కథకు సంబంధించిన క్లారిటీ ఇవ్వడం అలవాటు.


ఇప్పుడు అదే పద్ధతిని అనుసరిస్తూ జక్కన్న తాను మహేష్ తో తీయబోయే కథ గురించి క్లారిటీ ఇస్తాడని అనుకోవడమే కాకుండా ఈమూవీ జేమ్స్ బాండ్ తరహా స్పై థ్రిల్లర్ మూవీ అని జరుగుతున్న ప్రచారానికి క్లారిటీ రాజమౌళి నుండి వస్తుందని మహేష్ అభిమానులు ఆశిస్తున్నారు. మహేష్ సినిమా పై రాజమౌళి 800 కోట్ల బడ్జెట్ ఆ మూవీ నిర్మాత చేత పెట్టిస్తాడు అన్న ప్రచారం ఇప్పటివరకు కొనసాగింది. అయితే మహేష్ కు పాన్ ఇండియా ఇమేజ్ లేదు.


దక్షిణాది రాష్ట్రాలలో కూడ మహేష్ కు చెప్పుకోతగ్గ స్థాయిలో అభిమానులు లేరు. తెలుగు రాష్ట్రాలలో మహేష్ కు లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నప్పటికీ 800 కోట్ల బడ్జెట్ మహేష్ మూవీ పై వర్కౌట్ అవుతుందా అన్న సందేహాలు అప్పుడే మొదలైపోయాయి. దీనికితోడు ‘ఆర్ ఆర్ ఆర్’ కలక్షన్స్ ఊహించిన స్థాయిలో లేని పరిస్థితులలో మహేష్ మూవీ పై అంత భారీ బడ్జెట్ ఖర్చు పెట్టగలరా అన్న సందేహాలు కూడ ఉన్నాయి..




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: