స్టార్
డైరెక్టర్ రాజమౌళి తాజాగా తెరకెక్కించిన
సినిమా ఆర్ ఆర్ ఆర్.ఈ
సినిమా మార్చి 25న విడుదలై పెద్ద విజయం సాధించింది.మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్
ఎన్టీఆర్ హీరోలుగా ఈ
సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.అయితే కష్టానికి తగ్గ ప్రతిఫలం
ఆర్ఆర్ఆర్ రూపంలో దక్కడంతో చిత్ర బృందం హ్యాపీగా ఉన్నారు. ఇకపోతే కేవలం ఐదు రోజుల్లో రూ. 600 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టిన
ఆర్.ఆర్.ఆర్ హిందీలో రూ. 100 కోట్ల మార్కు చేరుకుంది. అంతేకాకుండా యూఎస్ లో ఈ చిత్రానికి మరింత ఆదరణ దక్కుతుంది. ఇకపోతే నార్త్ అమెరికాలో
ఆర్.ఆర్.ఆర్ $ 10 మిలియన్ వసూళ్లకు చేరుకుంది. అయితే యూఎస్ లో ఈ
మూవీ బ్రేక్ ఈవెన్ కి చేరుకోగా భారీ మొత్తంలో లాభాలు పంచడం ఖాయంగా కనిపిస్తుంది.
ఇక
సినిమా సక్సెస్ ఎలా ఉన్నా ఇందులో ఎన్టీఆర్‌ని సరిగా వాడుకోలేదని ఆయన అభిమానులు తెగ మండిపడుతున్నారు. అయితే
సినిమా అట్టర్ ఫ్లాప్.. మొత్తం
రామ్ చరణ్‌కే ప్రాధాన్యం ఇచ్చారు. ఇకపోతే ఎన్టీఆర్‌ని అస్సలు వాడుకోలేకపోయాడు. కాగా
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్‌గా నిజంగా చెబుతున్నా
సినిమా అయితే అస్సలు బాగాలేదు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్‌కి 10% స్కోప్ మాత్రమే ఇచ్చారు. ఇక అనవసరంగా మా హీరోకి టైమ్ వేస్ట్ చేశారు.అంతేకాదు వేరే ఇంకెవ్వరినైనా చేసుకోవాల్సింది” అంటూ విరుచుకుపడ్డాడు ఓ
ఎన్టీఆర్ అభిమాని.సినిమాలో
ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా చాలా బాగా నటించినా కూడా.. సినిమాలో ఇంటర్వెల్ తర్వాత తమ హీరోకు స్క్రీన్ స్పేస్ తగ్గడంపై వాళ్లు ఫీల్ అవుతున్నారు.
అయితే నాలుగేళ్లుగా
ఎన్టీఆర్ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులు దీనిని జీర్ణించుకోలేకున్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే సహనం కోల్పోయిన కొందరు
ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాజమౌళికి
ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషిస్తున్నారట. అంతేకాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారట. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ
టాలీవుడ్ లో ప్రచారం అవుతుంది. అయితే ఎన్టీఆర్ నిన్న
రాజమౌళి ),
రామ్ చరణ్ లకు కృతజ్ఞతలు తెలుపుతూ
లేఖ విడుదల చేశారు. ఇకపోతే
ఆర్.ఆర్.ఆర్ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరిని ఆ లేఖలో
ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నాడు.ఇదిలావుండగా లేఖ చివర్లో అభిమానులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు...!!