ఇన్ డైరెక్ట్ గా టాలీవుడ్ ను అవమానించిన హీరోయిన్..!!

P.Nishanth Kumar
తెలుగు సినిమా పరిశ్రమలో నటించిన చాలా మంది హీరోయిన్ లు తల్లి పాలు తాగి రొమ్ము పై గుద్దినట్లు టాలీవుడ్ ను అవమాన పరిచారు. ఇక్కడ సినిమాల్లోకి వచ్చి అగ్ర హీరోయిన్ లుగా ఎదిగి ఎదో పక్క భాషలో ఒకటి రెండు సినిమాలతో ఫేమ్ వచ్చి రాగానే తెలుగు సినిమా లపై వారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. చాలామంది హీరోయిన్ అలా ఎలా పడితే అలా టాలీవుడ్ పై వాగడం మనం చూశాం. తాజాగా ఈ జాబితాలో మరొక హీరోయిన్ చేరింది. డైరెక్ట్ గా కాకపోయినా ఇన్ డైరెక్ట్ గా ఆమె టాలీవుడ్ పై కొన్ని వ్యాఖ్యలు చేసింది.

ఊహలు గుస గుస లాడే సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకున్న రాశిఖన్నా తెలుగు లో మీడియం రేంజ్ హీరోయిన్ గా ఉంది. మంచి సినిమాలు చేస్తున్నా కూడా ఆమెకు ఎందుకో అవకాశాలు , స్టార్ డం మాత్రం రావడం లేదు. ఈ నేపథ్యంలో ఆమెకు స్టార్ హీరోయిన్ గా ఎదగడం లేదన్నా ఫ్రస్తేశానో లేదో ఇంకేమైనా నో తెలీదు కానీ తెలుగు సినిమా పరిశ్రమపై ఇన్ డైరెక్ట్ గా కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఇది తెలుగు అభిమానులకు ఎంతో నిరాశ ను కలిగిస్తున్నాయి.

ఇటీవలే ఆమె బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ లో నటించింది. అజయ్ దేవగన్ నటించిన ఈ రుద్ర అనే వెబ్ సిరిస్ లో నటించిన ఈమెకు బాలీవుడ్ లో అలా ఫేమ్ వచ్చిందో లేదో కానీ అప్పుడే టాలీవుడ్ పై నెగెటివ్ వ్యాఖ్యలు చేసింది.. ఇక్కడ కమర్షియల్ గా హీరోయిన్ లను యూజ్ చేస్తారని ఇతర భాషలలో సినిమాలలో హీరోయిన్ లకు కథలో ప్రాధాన్యత ఇస్తారని ఆమె చెప్పింది. దాంతో కొంతమంది తెలుగు సినిమా అభిమానులు ఆమె చెప్పేది తప్పు అని నిరూపిస్తున్నారు. తెలుగు లో హీరోయిన్ లకు ప్రాధాన్యత కలిగిన సినిమాలు చాలా ఉన్నాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు తెలుగు లో మళ్ళీ అవకాశం ఎలా అందుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: