మహేష్ అభిమానులు మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులు సైతం ఎప్పటినుంచో కలలుకంటున్న కాంబినేషన్ కు ఇప్పుడు రంగం సిద్ధమవుతోంది. దర్శక ధీరుడు రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో ఓ సినిమా రావాలని దాదాపు ఐదు సంవత్సరాల నుంచి డిమాండ్ నెలకొంది. ఈ నేపథ్యంలో త్వరలోనే వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు అని వార్తలు ప్రచారం కావడం ఆ వార్తలకు వీరిద్దరూ కూడా సానుకూలంగా స్పందించడం వంటివి జరిగింది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళటానికి కనీసం ఇంకొక ఆరు నెలల సమయమైనా పడుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం చేస్తున్న సర్కార్ వారి పాట త్రివిక్రమ్ దర్శకత్వంలోనీ సినిమాను కూడా పూర్తి చేసిన తర్వాత రాజమౌళితో పూర్తి స్థాయిలో సినిమాకు చేతులు కలపనున్నాడు. రాజమౌళి సినిమా అంటే మిగతా చిత్రాల తరహాలో హీరోలు ఉంటానంటే కుదరదు. పూర్తి స్థాయిలో ఈ సినిమా కు అంకితంఅయిపోవాలి. రాజమౌళి ఈ సినిమా కోసం ఏ విధంగా అయితే ఈ సినిమా కోసం కష్టపడతాడో ఆ విధంగా పాత్ర కోసం హీరో కూడా ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.
వర్క్ షాప్ లలో ఎక్కువగా పాల్గొనాల్సి ఉంటుంది. అంతే కాదు ప్రీ మేకింగ్ కి సమయం కూడా చాలా తీసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఆయన సెట్స్ మీదకు వెళ్లి విజయవంతంగా సినిమా పూర్తి చేసి విడుదల చేస్తాడు. ఆ విధంగా మహేష్ బాబు లాంటి స్టార్ హీరో జక్కన్న తో కలిసి ఓ సినిమా పూర్తి చేస్తాడా అనేది చూడాలి. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయని ఇప్పటివరకు తనకు బాగా దగ్గరైన హీరోలతో మాత్రమే ఆయన సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయన సినిమాలు చేసిన హీరోలందరినీ కూడా స్టార్ హీరోలు చేసింది జక్కన్నే. అలాంటి సమయంలో రాజమౌళి కంటే ముందే సినిమా పరిశ్రమలోకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ విధంగా జక్కన్న కు సపోర్ట్ చేస్తాడు అనేది ఇక్కడ అసలు విషయం. స్టార్ కావడంతో మామూలుగానే మహేష్ బాబుకు కొంత స్టార్ డమ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిలో ఏ ఒక్కరైనా తగ్గి ఉంటే తప్ప ఈ సినిమా పూర్తి అవ్వదు.