అందాల ముద్దుగుమ్మ అను ఇమ్మాన్యుయేల్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, అందం, అభినయం, నటన ఈ మూడు ఉన్నప్పటికీ విజయాలు లేకపోవడంతో అను ప్రస్తుతం ఇమ్మాన్యుయేల్ చేతిలో ఎక్కువ సినిమా అవకాశాలు లేవు. ఈ ముద్దుగుమ్మకు కెరియర్ ప్రారంభంలో నటించిన మజ్ను సినిమా మంచి విజయన్ని సాధించింది, నాని హీరోగా తెరకెక్కిన మజ్ను సినిమా మంచి విజయం సాధించడంతో ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలలో ఈ హాట్ బ్యూటీ కి అవకాశాలు కూడా దక్కాయి. అందులో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించింది, కాకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన నా పేరు సూర్య సినిమాలో అనూ ఇమాన్యుల్ హీరోయిన్ గా నటించింది, ఈ సినిమా కూడా అను ఇమ్మాన్యుయేల్ కు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన శైలజ రెడ్డి అల్లుడు సినిమాలో అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించింది, ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అను ఇమ్మాన్యుయేల్ కు విజయాన్ని తీసుకురాలేకపోయింది. ఇలా అను ఇమ్మాన్యుయేల్ నటించిన సినిమాలు ఎక్కువ శాతం విజయాలు కాలేకపోయాయి, ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే మహా సముద్రం మూవీ ద్వారా అనూ ఇమాన్యుల్ ప్రేక్షకులను పలకరించినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశే మిగిల్చింది. అందం , అభినయం, నటన ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకు బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలు మాత్రం కరువయ్యాయి, ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రావణాసుర సినిమాలో అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా నటిస్తుంది, ఈ సినిమా కనుక విజయం సాధించినట్లు అయితే ఈ ముద్దుగుమ్మ కు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కే అవకాశం ఉంది.