ఆర్ ఆర్ ఆర్ తరువాత పాన్ ఇండియా పై జూనియర్ నిర్ణయం !
‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల తరువాత జూనియర్ ఊహించిన స్థాయిలో అతడికి పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ రాకపోవడంతో త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో ప్రారంభం కాబోతున్న మూవీని పాన్ ఇండియా మూవీగా కాకుండా మన దక్షిణాది బడ్జెట్ సినిమాగా కొంతవరకు ఖర్చులు తగ్గిస్తూ నిర్మించాలని నిర్ణయం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ మూవీలో చరణ్ పక్కన హీరోయిన్ గా అలియా భట్ ను ఎంపిక చేయాలి అని మొదట్లో అనుకున్నప్పటికీ తెలుగు సినిమా రంగం పై అలియా కు ఏర్పడిన అసంతృప్తి రీత్యా ఈమూవీలో అలియా భట్ హీరోయిన్ గా ఉండకపోవచ్చు అన్న ప్రచారం జరుగుతోంది. అలియా భట్ ‘ఆర్ ఆర్ ఆర్’ నటిస్తున్న సమయంలో మరికొన్ని టాలీవుడ్ భారీ సినిమాలలో నటించాలని అభిప్రాయపడింది.
దీనికితోడు ఆమె రేంజ్ తగ్గ పారితోషికాన్ని చాలామంది నిర్మాతలు ముందుకు వచ్చాడు. అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల తరువాత అలియా భట్ ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి అని అంటున్నారు. ఆమూవీలోని ఆమె నటించిన సీత పాత్ర బాగా చిన్నదిగా మారడం అలియాకు కోపం తెప్పించింది అని అంటారు. వాస్తవానికి ఈసినిమాకు అలియా భట్ ను ఎంపిక చేసే సమయంలో రాజమౌళి ఆమె పాత్ర చాల కీలకం అని చెప్పి ఒప్పించాడు అని అంటారు.
అయితే ఈమూవీ విడుదల తరువాత మూవీ పై విశ్లేషణ చేసిన బాలీవుడ్ మీడియా ఇంత చిన్న పాత్రను అలియా భట్ ఎందుకు అంగీకరించింది అంటూ అనేక కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో అలియా అసహనానికి లోనవ్వడమే కాకుండా భవిష్యత్ లో తాను నటించే తెలుగు సినిమాల కథల విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదు అని నిర్ణయించుకుంది అని అంటున్నారు. రానున్న రోజులలో అలియా భట్ డైరెక్ట్ తెలుగు సినిమాలు జూనియర్ పాన్ ఇండియా సినిమాలు ఇక ఉండక పోవచ్చు అన్న ప్రచారం టాలీవుడ్ లో జరుగుతోంది..