ఆ హీరోతో పెళ్లికి రెడీ అయిన.. త్రిబుల్ ఆర్ హీరోయిన్?

praveen
ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది ఆలియా భట్. తన అందం అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల మొదటిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా లో రాంచరణ్ సరసన సీత అనే పాత్రలో నటించిన ఆలియాభట్ తన నటనతో ప్రేక్షకుల అందరినీ కూడా మంత్రముగ్ధుల్ని చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. త్రిబుల్ ఆర్ సినిమాలో ఆలియా భట్ కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ ఇక కనిపించిన కొంత సేపట్లోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.


 అయితే ఇక బాలీవుడ్ హాట్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ఆలియా భట్ గ్లామర్ పాత్రల్లోనే కాదు ఇక నటనకు స్కోప్ ఉన్న పాత్రలో కూడా నటిస్తూ ఉంటుంది. ఇక ఈ అమ్మడు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో లవ్ ట్రాక్ కారణంగా కూడా ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సంతోషం లో మునిగి పోయిన ఆలియా భట్..  మరికొన్ని రోజుల్లో ప్రేక్షకులందరికీ ఒక శుభవార్త చెప్పబోతోంది అనేది తెలుస్తుంది. అదే పెళ్లికి సంబంధించిన శుభవార్త.


 తన బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైందట ఆలియా భట్. త్వరలో ఇక పెళ్లి వార్తను అభిమానులతో షేర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్ల నుంచి ఇక ఈ జంట ప్రేమలో మునిగితేలుతోంది. ఈ క్రమంలోనే తమ ప్రేమ బంధానికి పెళ్లి తో  అఫీషియల్ గా మార్చుకోవాలని అనుకుంటున్నారట ఈ జంట. ఇక ఎన్నో రోజులు కాదు వచ్చే నెలలోనే ఇక ఈ స్టార్ జంట కపుల్స్ గా మారబోతున్నట్లు టాక్. కాగా ప్రస్తుతం ఆలియా భట్ రణబీర్ కపూర్ కలిసి నటిస్తున్న బ్రహ్మాస్త్రం అనే పాన్ ఇండియా మూవీ ప్రేక్షకుల అందరిలో కూడా అంచనాలు పెంచుతోంది అనే చెప్పాలి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: