వామ్మో; అవకాశాల కోసం చేతబడి చేయడం నేర్చుకున్న హీరోయిన్..!!

Divya
బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ కు పెట్టింది పేరు కంగనారనౌత్.. అయితే ఈమె వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాల్టీషో లాకప్.. ఈ షో ఎప్పుడు సంచలనాత్మక సీక్రెట్ ను తెలియజేస్తూ ఉంటుంది. అయితే తాజాగా హీరోయిన్ పాయల్ రోహత్గీ ఒక సీక్రెట్ విషయాన్ని తెలియజేసింది. అయితే ఈమె ఎలిమినేషన్ నుంచి తప్పుకునేందుకు ఇంత పెద్ద సీక్రెట్ చెప్పినట్లుగా సమాచారం. ఆ సీక్రెట్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం.


సినీ ఇండస్ట్రీలోకి వచ్చి పాయల్ రోహత్గీ 15 సంవత్సరాలు కావస్తోందట. అయితే ఒకానొక సమయంలో తన కెరియర్ చాలా డల్ అయిపోవడంతో ఆమె విపరీతంగా భయపడి పోయినట్లు తెలియజేసింది. ఇక అలాంటి సమయంలో తనకు అవకాశాలు రావేమో అని చాలా భయపడిపోయిందట. అయితే ఏం చేయాలో తెలియక చాలా రోజుల వరకు ఎంతో బాధను అనుభవించానని తెలిపింది. అయితే తన కెరియర్ పుంజుకు నేందుకు తాను చేతబడి చేసినట్లుగా తెలియజేసింది. అందుకోసం ఒకసారి ఢిల్లీలో ఉండే ఒక పూజారి సహాయంతో చేతబడి తో వశీకరణం అనే తాంత్రిక విద్యను నేర్చుకున్నట్లు గా తెలియజేసింది. ఇక వాటిని కూడా ప్రయోగించానని తెలిపింది. కానీ దానివల్ల కూడా తనకి ఎలాంటి ప్రయోజనం కలగలేదట.

కేవలం తన కెరీర్ను కాపాడుకొనేందుకే ఆమె అలా చేసినట్లు తెలియజేసింది. అయితే ఈ విషయం బయటకు తెలిస్తే తనని చులకనగా చేసి మాట్లాడతారని  ఇన్ని రోజులు ఆ విషయాన్ని తెలియ చేయలేదట. అయితే ఇప్పటికీ ఈ విషయం తెలుసుకున్న కొంతమంది తనని చులకనగా చేసి మాట్లాడొచ్చు అంటూ తెలియజేసింది. చదువుకున్న అమ్మాయిలు, ఉద్యోగం చేసే అమ్మాయిలు ఇలాంటివి నమ్మకపోవచ్చు అని తెలిపింది. అయితే ఈ విషయాన్ని విన్న కంగనా మాత్రం చాలా బిగ్గరగా నవ్వేసింది. అయితే నీకు ఎంతో టాలెంట్ అందం ఉన్నప్పటికీ నీకు ఇలాంటి మంత్ర తంత్రాలు అవసరం లేదని తెలిపింది కంగనారనౌత్. అయితే ఇండస్ట్రీ మొదట్లో తనను కూడా ఇలాగే అన్నారని కంగాన రౌత్ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: