టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ఎస్
రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చిత్రం 'త్రిబుల్ ఆర్'. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ మొదటిసారిగా కలిసి నటించిన ఈ
సినిమా ఎన్నో వాయిదాల తర్వాత గత శుక్రవారం మార్చి 25న విడుదల అయి బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఆర్ ఆర్ ఆర్ మ్యానియానే కనిపిస్తోంది. ఇక ఈ సినిమాను చూసిన ప్రముఖులు ఇప్పటికే ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి,
సూపర్ స్టార్ మహేష్ బాబు,
రెబల్ స్టార్ ప్రభాస్, అల్లుఅర్జున్ లాంటి అగ్ర తారలు..
ఈ సినిమాని వీక్షించడమే కాకుండా సోషల్
మీడియా వేదికగా తమ స్పందనను కూడా కనపరిచారు. సినిమాలో
రాజమౌళి పని తీరు.. ఎన్టీఆర్,
రామ్ చరణ్ నటన చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు. అయితే కొంత మంది తెలుగు స్టార్స్ మాత్రం ఇప్పటి వరకు సినిమాపై ఎటువంటి ట్వీట్స్ కూడా చేయలేదు. ఆ జాబితాలో
పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ కూడా ఉన్నారు. నిజానికి పవన్
కళ్యాణ్ బాహుబలి సినిమాని చాలాసార్లు బహిరంగంగానే ప్రశంసించారు. తెలుగు ప్రజలు గర్వించేలా చేసినందుకు ఎస్ఎస్
రాజమౌళి పై ప్రశంసలు కురిపించారు.కానీ త్రిబుల్ ఆర్
సినిమా విడుదలైన నాలుగు రోజులైనా.. పవన్
కళ్యాణ్ ఇప్పటి వరకు సినిమాపై స్పందించలేదు.
అయితే ఇందుకు కారణం కూడా లేకపోలేదు. విడుదలకు ఒక వారం ముందు పవన్ రాజకీయ పనులతో బిజీగా ఉన్నారు. మీటింగ్స్, సమావేశాలు అంటూ బిజీ అయిపోయారు. నిజానికి
మెగాస్టార్ చిరంజీవితో కలిసి పవన్
కళ్యాణ్ ఈ సినిమాని చూస్తారని.. ట్వీట్ కూడా చేస్తారని చాలా మంది మెగా అభిమానులు భావించారు. కానీ అలా జరగలేదు. పవన్
కళ్యాణ్ బిజీగా ఉండడం వల్లనే త్రిబుల్ ఆర్ సినిమాని చూడలేదని తెలుస్తోంది. అయితే త్వరలోనే పవన్
కళ్యాణ్ సినిమా చూసి తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు అని ఫాన్స్ సోషల్
మీడియా వేదికగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి అభిమానుల కోరిక మేరకు పవన్
కళ్యాణ్ సినిమా చూసి తన స్పందన కనబరుస్తారేమో చూడాలి...!!