టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అగ్ర హీరోయిన్ గా ఎదిగిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు పూర్తిగా తెలుగు సినిమాలకు దూరమై పోయిందనే చెప్పాలి. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అగ్ర హీరోలందరి సరసన నటించి పెద్ద అవకాశాలను అందుకుంది. మహేష్ రవితేజ రామ్ చరణ్ ఎన్టీఆర్ వంటి పెద్ద హీరోలతో ఆమె నటించి మంచి పాపులారిటీని అందుకోగ ఆమెకు కూడా భారీ స్థాయిలో క్రేజ్ ఏర్పడింది.
ఈ నేపథ్యంలో ఆమె తెలుగులో మంచి సినిమా అవకాశాలు ఉన్నప్పుడు బాలీవుడ్ లో సినిమాలు చేయడం కొన్ని సందర్భాల్లో తెలుగు సినిమాలు కాదని బాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేయడానికి ప్రాముఖ్యత ఇవ్వడంతో అందరూ డిసప్పాయింట్ అయ్యారు. కారణం వెరేదా అనేది తెలియదు కానీ రకుల్ ప్రీత్ సింగ్ ను తమ సినిమాల్లో పెట్టుకోవడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు. ఆ విధంగా రకుల్ చేజేతులా తన కెరీర్ ను నాశనం చేసుకుంది. చివరగా ఆమె నితిన్ హీరోగా నటించిన చెక్ అనే సినిమాలో కనిపించింది.
ఇప్పుడు ఆమె చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు అంటే ఆమె ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బాలీవుడ్ లో అయితే ఆమె ఆశించిన విధంగానే కొన్ని సినిమాలతో బిజీగా ఉంది. అంతే కాదు అక్కడ ఓ క్యాస్టింగ్ ఏజెన్సీ కూడా నెలకొల్పి బిజినెస్ చేస్తుంది. ఆ విధంగా రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమా ను తెలుగు లో చూడాలని ఉందని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. తెలుగు దర్శకులు నిర్మాతలు ఆమెకు ఆ విధమైన అవకాశాలు ఇస్తారా అనేది చూడాలి. ఇప్పుడు కుర్ర హీరోయిన్ లు ఎక్కువై పోవడంతో ఈ ముదురు భామను వారు పట్టించుకుంటారా అనేదే అసలు విషయం. ఏ సినిమా పరిశ్రమలో అయినా హీరోయిన్లు ఎంతో జాగ్రత్తగా తమ కెరీర్ను ప్లాన్ చేసుకోవాలి లేదంటే ఇలాగే రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ ముందుకు వెళ్ళదు వెళ్ళినా కూడా మధ్యలోనే ఎన్నో ఇబ్బందులకు గురిఅవుతుంది.