నిహారిక మౌనం పై నాగబాబు కామెంట్స్ !

Seetha Sailaja
మెగా డాటర్ నిహారిక సోషల్ మీడియాలో చాల యాక్టివ్ గా ఉండేది. తరుచూ నెటిజన్ లతో ఛాట్ చేస్తూ వారు అడిగే చిలిపి ప్రశ్నలకు చాల తెలివిగా సమాధానం ఇచ్చేది. అయితే గత కొంతకాలంగా నిహారిక సోషల్ మీడియాలో హడావిడి చేయకపోవడంతో ఆమె అభిమానులు కొంతవరకు నిరుత్సాహ పడుతున్నారు. దీనితో నిహారిక కు ఏమైంది అంటూ లోలోపల తమకు తామే ప్రశ్నలు వేసుకుంటున్నారు.


ఇలాంటి సమయంలో ఆమె అభిమానులకు అనుకోని విధంగా నాగబాబు నుండి సమాధానం దొరికింది. ఈమధ్య నాగబాబు తన ఇన్ స్టా గ్రామ్ ఎకౌంట్ లో ఛాట్ చేస్తున్నప్పుడు కొందరు మెగా అభిమానులు నిహారిక మౌనం గురించి ప్రశ్నించారు. అంతేకాదు మరికొందరైతే నిహారిక తన ఇన్ స్టా గ్రామ్ ఎకౌంట్ ను ఎందుకు కొనసాగించడం లేదు అంటూ ప్రశ్నించారు. దీనికి నాగబాబు స్పందిస్తూ తాను కోడింగ్ నేర్చుకుని కావాలనే నిహారిక కు తెలియకుండా ఆమె ఎకౌంట్ ను డీ యాక్టివైజ్ చేసానని మళ్ళీ కొన్నిరోజుల తరువాత డీ కోడింగ్ చేసి ఆమె ఎకౌంట్ ను యాక్టివ్ చేస్తాను అంటూ తెలివిగా సమాధానం ఇచ్చాడు.


వాస్తవానికి ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిహారిక ఎందుకు మౌనంగా ఉందో ఎవరికీ తెలియదు. దీనిమీద రకరకాల ఊహాగానాలు కూడ వచ్చాయి. అయితే ఆ ఊహాగానాల పై అటు నిహారిక కానీ కుటుంబ సభ్యులు ఎవరు స్పందించలేదు. కానీ ఆమె మౌనం కొనసాగుతూనే ఉంది.


ఇలాంటి పరిస్థితుల మధ్య నిహారిక త్వరలో సినిమా నిర్మాణ సంస్థను ప్రారంభించి వెబ్ సిరీస్ లు కూడ తీస్తుంది అన్నవార్తలు కూడ వచ్చాయి. అయితే వాటి పై కూడ ఎటువంటి క్లారిటీ లేదు. మెగా కుటుంబంలో నిహారికకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది దీనితో ఆమెకు సోషల్ మీడియాలో కూడ లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నా ఆ విషయాలను పట్టించుకోకుండా నిహారిక ఎందుకు మౌనం వహిస్తోంది అన్నవిషయం పై అభిమానులకు క్లారిటీ లేక నాబాబు చెప్పిన సమాధానంతో సంతృప్తి పడలేక అభిమానులు తెగ కన్ఫ్యూజ్ లో ఉన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: