జానీ మాస్టర్ టాలీవుడ్ లో టాప్ డ్యాన్స్ మాస్టర్స్ లో ఒకరు.ఇక ఈయన తన కెరీర్ ఆరంభంలో డ్యాన్స్ రాదని బయటకి పంపించేస్తే ఇప్పుడు స్టార్ కొరియోగ్రాఫర్ గా ఎదిగాడు.జానీ మాస్టర్ కేవలం టాలీవుడ్ లోనే కాదు తమిళ్, కన్నడ స్టార్ హీరోల సినిమాలకు కూడా వర్క్ చేస్తున్నారు. ఇటీవల తాజాగా తమిళ్ స్టార్ హీరో విజయ్ 'బీస్ట్' సినిమాలోని పాటలకి జానీ మాస్టర్ చేసిన కొరియోగ్రఫీ బాగా వైరల్ అయింది.అయితే ఇటీవల జానీ మాస్టర్ కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్తో కలిసి పనిచేశారు. సుదీప్ నటించిన 'విక్రాంత్ రోణ' సినిమాకి జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పని చేశారు.
ఇకపోతే ఈ సినిమాలో జానీ పనితనం నచ్చి సుదీప్ స్పెషల్ కార్ని జానీ మాస్టర్‌కి గిఫ్ట్‌గా ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. అంతేకాదు ఈ విషయాన్నీ జానీ మాస్టర్ తన సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు.అయితే తనకి ఇచ్చిన కార్ వద్ద సుదీప్తో కలిసి ఫోటో దిగిన జానీ మాస్టర్ ఆ ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఆయన ఆ ఫోటోని షేర్ చేస్తూ.. 'ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు సుదీప్ సర్కి, వాళ్ళ ఫ్యామిలీకి ధన్యవాదాలు.అంతేకాదు మీరు నన్ను ట్రీట్ చేసిన విధానం, నన్ను చూసుకున్న విధానం నాకు బ్లెస్సింగ్స్ లాంటిది. అయితే నేను మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తాను. ఇక మీరు నా జీవితంలో ఉండటం నా అదృష్టం' అంటూ పోస్ట్ చేశారు.
కాగా ఈ కార్ మహీంద్రా కంపెనీకి చెందిన థార్ మోడల్.అయితే ఇది జీప్ తరహాలో ఉంటుంది. ఇకపోతే దీని ధర సుమారు 15 లక్షలు ఉంటుంది. అయితే ఈ రేంజ్ కార్ని సుదీప్ జానీ మాస్టర్‌కి గిఫ్ట్ ఇచ్చారంటే ఆయన పనితనం బాగా నచ్చి ఉంటుంది అని అంటున్నారు నెటిజన్లు.అయితే ఇక సుదీప్‌ని కూడా అందరూ పొగుడుతున్నారు. ఇక సుధీర్ నటిస్తున్న విక్రాంత్ రోనా సినిమా నుంచి ఇటీవలి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై భారీ రెస్పాన్స్ ని కనబరిచింది. ఈ సినిమాలో సుదీప్ సరసన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది...!!