పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వం లో భవదీయుడు భగత్ సింగ్ అనే మూవీ ఇప్పటికి అనౌన్స్మెంట్ అయిన విషయం మన అందరికి తెలిసిందే, ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్నారు, అయితే ఈ సినిమా అనౌన్స్మెంట్ జరిగి చాలా కాలం అవుతున్న ఇప్పటి వరకు ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు. అయితే ఇన్ని రోజుల పాటు భీమ్లా నాయక్ సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాయక్ ఈ సినిమా తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు, ఇది ఇలా ఉంటే భీమ్లా నాయక్ సినిమాతో పాటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమాను కూడా మొదలు పెట్టాడు, ఈ సినిమా షూటింగ్ మాత్రం ఇప్పటి వరకు దాదాపు 50 శాతం కంప్లీట్ అయినట్లు అప్పట్లో ఈ సినిమా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఓ ఇంటర్వ్యూ లో తెలియజేశాడు.
తిరిగి ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా అనేక కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది, అయితే ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. అయితే హరిహర వీరమల్లు సినిమా పూర్తి అయిన తర్వాత భవదీయుడు భగత్ సింగ్ మూవీ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉండడం తో ఈ గ్యాప్ లో హరీష్ శంకర్ 'దువ్వాడ జగన్నాథం' సినిమా ను హిందీ లో రీమేక్ చేసే ఆలోచన లో ఉన్నట్లు ఒక వార్త నెట్టింట్లో లో వైరల్ అవుతుంది, అయితే దువ్వాడ జగన్నాథం సినిమా హిందీ లో రీమేక్ చేయడానికి దిల్ రాజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది, సిద్ధార్థ్ మల్హోత్రా హీరో గా ముందుకు వెళ్లడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.