త్రిబుల్ ఆర్ థియేటర్ వద్ద.. అభిమాని గన్ తో హల్ చల్?
తమ అభిమాన హీరో లకు ఏకంగా పాలాభిషేకాలు కూడా చేయడం లాంటివి చేశారు. అయితే ఇప్పటివరకు ఇలా తమ అభిమాన హీరోల సినిమాలు రిలీజ్ అయితే పాలాభిషేకాలు చేయడం లేదా పూలమాల వేయడం చూసాం. కానీ ఇక్కడ మాత్రం ఒక అభిమాని కాస్త హద్దులు దాటి ప్రార్ధించాడు. ఏకంగా సినిమా థియేటర్ కు ఒక గన్ వెంటబెట్టుకుని వచ్చాడు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. త్రిబుల్ ఆర్ సినిమా చూసేందుకు ఒక అభిమాని థియేటర్ వద్దకు వచ్చాడు.
జిల్లాలోని పిఠాపురం శ్రీ అన్నపూర్ణ థియేటర్ లో త్రిబుల్ ఆర్ సినిమా ప్రదర్శిస్తున్నారు. అక్కడికి ఒక అభిమాని వచ్చాడు. ఏకంగా తన జేబులో గన్ పెట్టుకొని హల్చల్ చేశాడు. ఏకంగా అక్కడ ఉన్న మీడియా వారందరికీ కూడా గన్ చేతిలో పట్టుకుని ఫోజులు ఇచ్చాడు. అక్కడితో ఆగకుండా ఇక త్రిబుల్ ఆర్ మూవీ ప్రదర్శిస్తున్న సమయంలో సినిమా థియేటర్ లోని తెర ముందు తిరుగుతూ ఉన్నాడు. అయితే ఇక గన్ పట్టుకొని ఆ యువకుడు అటు ఇటు తిరగడం తో అక్కడ ఉన్న ప్రేక్షకులందరూ కాస్త భయం తో ఊగిపోయారు.. ఇక తన చేతిలో ఉన్న తుపాకీ నిజమైనదా కాదా తెలియక ఒక్కసారిగా షాక్ లో ఉన్నారు. అయితే ఇక గన్ పట్టుకొని హల్చల్ చేసిన యువకుడు పిఠాపురం కు చెందిన అస్సామీ గా చెబుతున్నారు. ఇక అతను గన్ పట్టుకొని హల్చల్ చేసిన దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి..