సమస్యలలో సర్కారు వారి పాట ?
‘సరిలేరు నీకెవ్వరు’ సూపర్ హిట్ తరువాత మహేష్ తన స్పీడ్ పెంచి వరసపెట్టి సినిమాలు చేయాలి అనుకున్నాడు. అయితే కరోనా పరిస్థితులు అడ్డుతగలడంతో మహేష్ ఆశలు అన్నీ నీరుకారిపోయి రెండు సంవత్సరాల కాలం వృధాగా అయిపోయింది. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న మూవీ ఒక్కటి మాత్రమే సెట్స్ పై ఉన్నది అదే ‘సర్కారు వారి పాటి’
‘గీత గోవిందం’ మూవీని పరుశు రామ్ సూపర్ హిట్ చేయడంతో మహేష్ ముచ్చటపడి పరుశు రామ్ కు అవకాశం ఇచ్చాడు. అయితే ఆ అవకాశాన్ని ఇప్పుడు పరుస్ రామ్ నిలబెట్టుకోలేక పోతున్నాడా అన్న గుసగుసలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న గుసగుసలు ప్రకారం ఇప్పటివరకు షూట్ అయిన భాగాన్ని మహేష్ చూసాడాట.
అయితే ఆ ఈ మూవీలోని సన్నివేశాలు మహేష్ కు ఏమాత్రం సంతృప్తిని ఇవ్వకపోవడంతో ఈ మూవీ పరిస్థితి ఏమిటి అంటూ మహేష్ దిగులు పడుతున్నట్లు టాక్. దీనితో పరుశు రామ్ ఈ మూవీ స్క్రిప్ట్ ను మళ్ళీ మార్చి తీస్తానని చెపుతున్నప్పటికీ ఇప్పటికే విడుదల తేదీ ప్రకటింపబడ్డ ఈమూవీని మరొకసారి వాయిదా వేయడం ఇష్టంలేక వీలైనంతవరకు ఈమూవీలోని సన్నివేశాలకు రిపేర్లు చేయమని మహేష్ సలహా ఇచ్చినట్లు టాక్. అయితే ఈమూవీ అవుట్ పుట్ బాగాలేదు అంటూ ఇప్పటికే వార్తల హడావిడి మొదలు కావడంతో ఈవిషయాలతో మహేష్ అభిమానులు కలత చెందుతున్నారు.
గతంలో ‘బ్రహ్మోత్సవం’ మూవీ విషయంలో కూడ ఇలాంటి వార్తలే బయటకు వచ్చి చివరకు ఆవార్తలు నిజం అయి ఆమూవీ ఘోరమైన ఫ్లాప్ గా మారింది. ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుందా అంటూ అభిమానులు కలవరపడుతున్నారు. దీనికితోడు ప్రస్తుతం కీర్తీ సురేష్ ఐరన్ లెగ్ సెంటిమెంట్ కూడ ఈమూవీని భయపెడుతోంది. ఇలా రకరకాల నెగిటివ్ సెంటిమెంట్స్ వెంటాడుతున్న ఈ మూవీ పరిస్థితి ఏమిటి అంటూ మహేష్ అభిమానులకు మాత్రమే కాకుండా మహేష్ కూడ భయపడుతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..