పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ కు
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, తన సినిమాలతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న
పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. అయితే అభిమానుల కోరిక మేరకు
పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ వకిల్ సబ్ సినిమాతో తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు, బాలీవుడ్
సినిమా పింక్ కి
రీమేక్ గా తెరకెక్కిన వఖిల్ సబ్
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి విజయాన్ని సాధించింది.
ఇలా వకిల్ సబ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న పవన్
కళ్యాణ్ ఆ తర్వాత మలయాళ సూపర్ హిట్
మూవీ అయ్యప్పనున్ ఈ సినిమాను కొషియన్ సినిమాను తెలుగులో భీమ్లా
నాయక్ పేరుతో
రీమేక్ చేసి విడుదల చేశాడు, ఈ
సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇలా రీ ఎంట్రీ తర్వాత రెండు విజయాలను అందుకున్న
పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్నాడు, అందులో భాగంగా ఇప్పటికే పవన్
కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి ర్శకత్వంలో తెరకెక్కిన హరిహర వీరమల్లు
సినిమా షూటింగ్ ను 50 శాతం వరకు పూర్తి చేశాడు. ఈ
సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం, అలాగే పవన్
కళ్యాణ్,
హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్
మూవీ లో నటించబోతున్నాడు. ఈ సినిమాతో పాటు
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో
పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ నటించబోతున్నాడు, ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇప్పటికే జరిగిపోయింది, ఈ సినిమాలతో పాటు పవన్
కళ్యాణ్ తమిళ
సినిమా వినోదయ సీతం సినిమాను తెలుగులో
రీమేక్ కూడా చేయబోతున్నాడు, ఇలా పవన్
కళ్యాణ్ వరుస సినిమాలతో ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో ఉన్నాడు.