ఫ్యాన్స్ మధ్య చిచ్చుపెట్టిన రాధే శ్యామ్ ప్లాప్!

Purushottham Vinay
రాధే శ్యామ్ ప్లాప్ ఇప్పుడు ముగ్గురు హీరోల ఫ్యాన్స్ మధ్య చిచ్చుని రగిల్చింది.ఈ సినిమా ప్లాప్ ఏకంగా ఫ్యాన్స్ మధ్య వార్ ని డిక్లేర్ చేసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. `బాహుబలి`సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ దాదాపు మూడేళ్ల తరువాత `రాధేశ్యామ్` చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మార్చి 11వ తేదీన ఈ చిత్రం అత్యంత భారీ స్థాయిలో విడుదలైంది.ఈ సినిమా రిలీజ్ కు ముందు భారీ హంగామానే జరిగింది. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆ స్థాయిలో సినిమా లేదని ఫ్యాన్స్ తో పాటు ట్రేడ్ వర్గాలు ప్రేక్షకులు కూడా మిక్స్డ్ టాక్ వినిపించారు. దీంతో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెలవమైన ప్రదర్శనని చూపించింది. పది రోజుల్లో ఈ సినిమా 200 కోట్ల లోపు గ్రాస్  మాత్రమే రాబట్టగలిగింది. ఓన్లీ డివైడ్ టాక్ రావడం వల్లే ఈ మూవీ భారీ స్థాయిలో అంచనాలకు అనుగుణంగా వసూళ్లని రాబట్టలేకపోయింది.సినిమా ప్రీ రిలీజ్ పరంగా రికార్డు స్థాయిలో బిజినెస్ చేసిన ఈ మూవీ వసూళ్ల పరంగా మాత్రం భారీ స్థాయిలో నష్టాలని అందించబోతోందని ఇప్పటికే చాలా ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నారు. దాదాపుగా 100 కోట్లకు పైగా ఈ మూవీకి నష్టాలు వాటిల్లడం గ్యారెంటీ అని చెబుతున్నారు.



ఇక ఈ వార్త ఇప్పడు ముగ్గురు హీరోల ఫ్యాన్స్ మధ్య చిచ్చుకు ప్రధాన కారణం అయ్యింది. ప్రభాస్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక భారీ నష్టాలని ఎదుర్కోబోతున్న నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ లో అసహనం కట్టలు తెంచుకుంటోంది.ఆ ద్వేషాన్ని ఇద్దరు హీరోల అభిమానులపై చూపించడం ఇప్పడు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది. రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులపై విరుచుకుపడుతున్నారు. వారిపై చాలా తీవ్రంగా కామెంట్ లు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం `రాధేశ్యామ్` రిలీజ్ సమయంలో పవన్ కళ్యాణ్ `భీమ్లానాయక్` థియేటర్లలో వుంది. ఈ సినిమాని పుష్ చేయడం కోసం `రాధేశ్యామ్`పై అసత్య ప్రచారం చేశారని కావాలనే మా హీరో సినిమాని దెబ్బేశారని ప్రభాస్ ఫ్యాన్స్ పవన్ ఫ్యాన్స్ పై తీవ్రంగా మండిపడుతున్నారట.ఈ సినిమాకి థియేటర్లు తగ్గడం వెనక పెద్ద కుట్రే జరిగిందని అంతే కాకుండా సినిమాపై నెగెటివ్ టాక్ ని కూడా స్పెడ్ చేయడంలోనూ పవన్ ఫ్యాన్స్ ప్రముఖ పాత్ర పోషించారని  `భీమ్లానాయక్`సినిమాకు ప్లస్ అయ్యేలా వ్యవహరించారని ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారట. ఇక `రాధేశ్యామ్`పై నెగెటివ్ టాక్ స్ప్రెడ్ కావడానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఓ కారణం అంటూ కామెంట్ లు చేస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొంత డ్యామేజీకి కారణంగా నిలిచారని సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్ లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: