నాని కి అది ప్లస్ అవుతుందా.. మైనస్ అవుతుందా..!!

P.Nishanth Kumar
నాచురల్ స్టార్ నాని కొత్తగా ఆలోచించడం వల్ల ఇప్పుడు కొంతమంది సినిమా విశ్లేషకుల విమర్శలకు గురి అవుతున్నాడు. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికి అనే ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. జంధ్యాల తరహాలో ఈ సినిమా మంచి కామెడీ భరితమైన సినిమాగా ఉండబోతుంది అని చెబుతున్నారు. మలయాళ కథానాయిక నజ్రియా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా ఆమె పాత్ర ను వెరైటీ గా తీర్చిదిద్దారని తెలుస్తుంది. ఈ సినిమాతో పాటే నాని సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ దర్శకత్వంలో కూడా మరొక సినిమా చేసిన విషయం తెలిసిందే.

ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా విడుదల చేసింది యూనిట్. అయితే ఇది అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలోని పాత్ర పోలిన పుష్ప అలా ఆయన చేస్తూ ఉండటమే ఈ రకమైన విమర్శలు కావడానికి కారణం అవుతుంది. ట్రెండ్ ను ఫాలో అవడం కంటే ట్రెండ్ ను సెట్ చేసినప్పుడే ఏ హీరోకైనా ఎక్కువగా ఫాలోయింగ్ ఏర్పడుతుంది. అప్పుడే ఆయన చేసిన సినిమాలు హిట్ అవుతూ ఉంటాయి. లేకపోతే ఇలాంటి విమర్శలే ఎదురవుతూ ఉంటాయి ఆ విధంగా నాని కి ఈ సినిమా ప్లస్ అవుతుందా లేదో మైనస్ అవుతుందా అనేది చూడాలి.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకుంది. తెలంగాణ నేపథ్యంలో కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతుంది అని అంటున్నారు. ఏదేమైనా నాని గతంలో కంటే ఇప్పుడు సినిమాలను ఎంపిక చేసుకునే విషయంలో కాస్త వెనకబడ్డాడు అని చెప్పవచ్చు. మరి ఈ విధంగా చేసుకుని ప్రేక్షకులను ఎందుకు నిరాశ పరుస్తున్నారో తెలియాలి. ఆయన వెనకాల వచ్చిన హీరోలు మంచి సినిమాల్లో అగ్ర దర్శకులతో సినిమాలు చేస్తూ పోతుంటే నాని మాత్రం మీడియం రేంజ్ దర్శకులతో మాత్రమే సినిమాలు చేయడం ఆయన అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: