రజిని కుమార్తె ఐశ్వర్య జీవితంలో కొత్త మలుపు?

praveen
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె గత కొంత కాలం నుంచి వార్తల్లో హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు దర్శకురాలిగా నిర్మాతగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న ఐశ్వర్య ఇటీవలే తన భర్త ధనుష్ తో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించింది.  ఏకంగా 18 ఏళ్ల వైవాహిక బంధానికి టాటా చెప్పేసింది ఐశ్వర్య. ఇక ఇది కాస్త భారతీయ చలనచిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారిపోయింది. ఇక విడాకుల ప్రకటన వచ్చిన నాటి నుంచి ఐశ్వర్య ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా కూడా హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంది.


 అయితే విడాకుల తర్వాత ఐశ్వర్య రజనీకాంత్ ప్రస్తుతం కెరియర్ లో బిజీగా ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఫ్యూచర్ ప్రాజెక్టుని ప్లాన్ చేసుకుంటున్నారు ఐశ్వర్య రజనీకాంత్.  ఇక పోతే ఇక ఇప్పుడు ఐశ్వర్య జీవితంలో ఒక కీలక మలుపు తిరిగింది అన్నది తెలుస్తుంది. మొదటిసారి ఐశ్వర్యకు బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. తమిళ చిత్రసీమలో మంచి డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న ఐశ్వర్య ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టబోతుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ వారాన్ని ఇంతకంటే అద్భుతంగా ప్రారంభించవలేను అంటూ ఐశ్వర్యా చెప్పుకొచ్చింది.


 దర్శకురాలిగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నా ప్రయాణాన్ని మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యా అంటూ చెబుతూ సంతోషం వ్యక్తం చేసింది ఐశ్వర్య రజనీకాంత్. ఓ సాథి చల్ అనే ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించబోతున్నా అంటూ ఐశ్వర్య తెలిపింది  కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సి9 పిక్చర్స్ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక తమిళంలో మంచి దర్శకురాలిగా గుర్తింపు సంపాదించుకున్న ఐశ్వర్య బాలీవుడ్ లో కూడా రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: