ఆర్ ఆర్ ఆర్ కు సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం !

Seetha Sailaja
‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో ఆసినిమా గురించి జూనియర్ చరణ్ అభిమానులు ఎదురు చూస్తుంటే ఆసినిమా దర్శక నిర్మాతలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల రేట్లను విపరీతంగా పెంచిందని ఇప్పుడు దానికి అదనంగా మరొక 100 రూపాయలు పెంచడంతో ఇప్పుడు సగటు మనిషి తాను కుటుంబ సభ్యులతో ‘ఆర్ ఆర్ ఆర్’ ను చూడాలి అంటే ఒక విలాసంగా మారింది అంటూ కొందరు ‘ఆర్ ఆర్ ఆర్’ దర్శక నిర్మాతలు టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.


హాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థలు అయినా మార్వేల్ స్టూడియోస్ వార్నార్ బ్రదర్స్ వేల కోట్ల బడ్జెట్ తో సినిమాలు తీస్తారని అంతమాత్రంలో వారి సినిమాల టిక్కెట్ల రెట్లు తమ సినిమా బడ్జెట్ పెరిగిపోయిందని టిక్కెట్ల రెట్లు పెంచారా అంటూ ఎదురు ప్రశ్నలు పడుతున్నాయి. అంతేకాదు సినిమా అన్నది ఒక వ్యాపారం అని అది ప్రజాసేవ కాదని భారీ సినిమాలు తీసి భారీ పారితోషికాలు పుచ్చుకునే వారికోసం సగటు ప్రేక్షకుడు ఎందుకు జేబులు ఖాళీ చేసుకోవాలి అని మరిందరు ప్రశ్నిస్తున్నారు.


ఈ ప్రశ్నలు ఇలా కొనసాగుతూ ఉండగానే ఓపెన్ అయిన ‘ఆర్ ఆర్ ఆర్’ టిక్కెట్ల బుకింగ్ అత్యంత వేగంగా ధరలతో సంబంధం లేకుండా పరుగులు తీస్తోంది. వాస్తవానికి సినిమా అన్నది సామాన్యుడుకి వినోదాన్ని అందించే ఒక సాధనం. అలాంటి వినోదం ఇప్పుడు సమాన్యుడుకి అందుబాటులో లేకుండా పోయింది అంటూ కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి.


మరొక కోణంలో ‘ఆర్ ఆర్ ఆర్’ తన టిక్కెట్ల రేట్లను పెంచుకుని సామాన్యుడుకి అందని వినోద సాధనంగా మారి సినిమాలను సామాన్యుల నుండి మరింత దూరం చేసే అవకాశం ఉంది అంటూ మరి కొందరి అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే చాలామంది జనం ధియేటర్లకు దూరం అవ్వడంతో సినిమాలు అన్నీ కేవలం మూడు రోజుల సినిమాగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితులలో ధియేటర్లలోనే చూడండి అని ఆర్ ఆర్ ఆర్ టీమ్ చెపుతున్నా ఎంతవరకు ఆపిలుపుకు స్పందన వస్తుంది అన్నది చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: