ఓటీటీలో పోటీ పడుతున్న స్టార్ హీరోల సినిమాలు ఇవే..!

Satvika
కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ ఎన్ని కష్టాలను ఎదుర్కొంది అనేది ప్రత్యెకంగా చెప్పాల్సిన పనిలేదు.. కరోనా తగ్గిన తర్వాత వరుస సినిమాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. అస్సలు గ్యాప్ లేకుండా వరుస సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే థియెటర్లకు కొన్ని ఆంక్షలు ఉండటంతో అందరూ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదల అవ్వడానికి దర్షక, నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు..చాలా సినిమాలు ఓటీటీలో విడుదల అవుతున్నాయి. భారీ కలెక్షన్స్ ను అందుకోకపోయినా సినిమా హిట్ టాక్ ను అందుకుంటున్నాయి..


అగ్ర హీరోలైన పవన్ కల్యాణ్, అజిత్‌లు ఓటీటీ లోనూ పోటీ పడుతున్నారు. వారు చివరగా నటించిన చిత్రాలు థియేటర్లలో ఒక రోజు గ్యాప్‌తో వస్తే ఓటీటీ లో విడుదల సిద్దం అవుతుంది.పవన్ కల్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' చిత్రం, అజిత్ నటించిన 'వలీమై' చిత్రం ఒకేరోజు ఓటీటీలో విడుదల కు సిద్దం అవ్వడానికి రెడీ అవుతూన్నాయి. ఈ రెండు సినిమాలు వేరు వేరు డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో విడుదల అవుతున్నాయి. భీమ్లా నాయక్' చిత్రం 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్', 'ఆహా' ఓటీటీ లో విడుదల అవుతుంటే.. అజిత్ 'వలీమై' చిత్రం 'జీ 5'లో విడుదలవుతోంది.


ఈ సినిమాలు విడుదల అవుతున్న నేపథ్యం లో సినిమా పై అంచనాలు క్రియేట్ అవుతూన్నాయి. వాటికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా జొరుగా సాగుథున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా స్టార్ హీరోల సినిమాలు కావడం విశేషం.. ఓటీటీలో ఎ సినిమా సత్తాను ఛాటుతుంది అనే విషయం తెలియాల్సి వుంది.. ఈ సినిమాలె కాదు చాలా సినిమాలు ఓటీటీ లో డైరెక్ట్ గా విడుదల అయ్యి మంచి సక్సెస్ అందుకున్నాయి.. చిన్న హీరోలు, స్టార్ హీరోలు అందరూ కూడా సినిమాలను ఓటీటీలో విడుదల కానున్నాయి. ప్రస్తుతం సమ్మర్ లో సినిమాలు చాలానె విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: