రాధే శ్యామ్ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన పూజ హెగ్డే...!!

murali krishna
ఎన్నో అంచనాల మధ్య భారీ బడ్జెట్ గా చిత్రంగా విడుదలైన రాధే శ్యామ్ ప్రేక్షకులను పూర్తిగా ఫ్యాన్స్ ను నిరాశరపరిచింది. ప్రభాస్ ఇమేజ్ కి ఆ స్టోరీ ఏమాత్రం కూడా సెట్ కాలేదు.
ప్యూర్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన రాధే శ్యామ్ ఎమోషనల్ గా అయితే కనెక్ట్ కాలేదు. దానికి తోడు ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడంతో సినిమా ఫలితం డిజాస్టర్ అయ్యిందని తెలుస్తుంది.. అడ్వాన్స్ బుకింగ్స్ కారణంగా మొదటి మూడు రోజులు ఓ మోస్తరు వసూళ్లు సాధించిన రాధే శ్యామ్ వీక్ డేస్ నుండి చతికల పడిందట. ప్రీ రిలీజ్ బిజినెస్ లో కేవలం 50 శాతం మాత్రం రాబట్టగలిగిందని తెలుస్తుంది.. మిగిలిన యాభై శాతం వసూళ్లు కూడా వచ్చే మార్గం లేదు.
మరో నాలుగు రోజుల్లో ఆర్ ఆర్ ఆర్ విడుదల కానుంది. దీంతో రాధే శ్యామ్ చిత్రాన్ని థియేటర్స్ నుండి అయితే తొలగిస్తారు. తన ఇమేజ్ నుండి బయటికొచ్చి ఓ ప్రయోగాత్మక చిత్రం చేసిన ప్రభాస్ కి ఊహించని షాక్ అయితే తగిలింది. ఈ నేపథ్యంలో రాధే శ్యామ్ (Radhe Shyam) బాక్సాఫీస్ రిజల్ట్ పై పూజా హెగ్డే నోరు విప్పారు.ఆమె చిత్ర ఫలితం కేవలం విధిరాత అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారట.పూజా హెగ్డే మాట్లాడుతూ.. కొన్ని సినిమాలు మనకు యావరేజ్‌ అనిపించినా కానీ బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతాయి. మరికొన్ని మనకు బాగా నచ్చినా రిజల్ట్‌ అనుకున్నట్లు అయితే ఉండకపోవచ్చు. ఏ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనేది ముందుగానే రాసి పెట్టి ఉంటుంది. అలాగే అది జరుగుతుంది. రాధేశ్యామ్‌ విషయంలో కూడా అదే జరిగిందని బాక్సీఫీస్‌ వద్ద సినిమా తలరాత మారిపోతుంది అని బలంగా నమ్ముతాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
మరోవైపు పూజా హెగ్డే , ప్రభాస్ కెమిస్ట్రీ కూడా అస్సలు కుదరలేదు. దానికి కారణం వారికి వచ్చిన విబేధాలు కావచ్చు. రాధే శ్యామ్ సెట్స్ లో పూజా హెగ్డే, ప్రభాస్ మధ్య గొడవ జరిగినట్లు అప్పట్లో ప్రచారం అయితే జరిగింది. ఈ వార్తలను మూవీ యూనిట్ ఆయితే ఖండించారు. రాధే శ్యామ్ ప్రమోషనల్ ఈవెంట్స్ లో ఇద్దరు కూడా ఎడమొహం పెడమొహం గా ఉన్నారు. దీంతో ప్రచారమైన వార్తల్లో నిజం ఉందన్న నిర్ణయానికి అయితే పలువురు వచ్చారు.
కారణం ఏదైనా రాధే శ్యామ్ రిజల్ట్ అయితే బెడిసికొట్టింది. దర్శకుడు రాధాకృష్ణ నెగిటివ్ కామెంట్స్ ను కొట్టిపారేశారు. తన సినిమాను, అలాగే టేకింగ్ ని సమర్ధించుకున్నారు. వెజిటేరియన్ మూవీలో నాన్ వెజ్ కావాలంటే ఎలా అంటూ సెటైర్లు కూడా పెల్చారు.. ఓ మంచి అవకాశాన్ని రాధాకృష్ణ చెడగొట్టుకున్నారు.. రాధే శ్యామ్ హిట్టయితే ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయేది. స్టార్స్ తో పాన్ ఇండియా చిత్రాలు చేసే దర్శకుల లిస్ట్ లో ఆయన ఉండేవారు. ఇప్పుడు ప్రభాస్ రేంజ్ స్టార్ అయితే ఆయనకు అవకాశం ఇవ్వడం కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: