హీరోయిన్ భావన రీ ఎంట్రీ కోసం సిద్ధమవుతోందా..!!

Divya
తెలుగులో మహాత్మ , ఒంటరి వంటి చిత్రాలలో నటించి మెప్పించింది హీరోయిన్ భావన. ప్రస్తుతం ఈమె సినిమాలకు కాస్త దూరంగానే ఉంటోంది.. ఆ మధ్య పెళ్లి పీటలు ఎక్కి వివాహం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ దీంతో ఈమె అభిమానులకు కాస్త నిరుత్సాహానికి ఇచ్చింది. అంతేకాకుండా ఈమె గురించి పలురకాలుగా ప్రచారం కూడా జరుగుతోంది. ఇక అంతే కాకుండా ఆమె పై కొందరు దుండగులు దాడులకు పాల్పడ్డారని కూడా ఉన్నది. అయితే ఈ విషయంలో మాత్రం ఎలాంటి నిజం ఉందో తెలియాలి ఉంది. ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు కాస్త ఆవేదనకు గురయ్యారని చెప్పవచ్చు.
ఇక ఈమె అభిమానులు మాత్రం ఈమె తిరిగి సినిమాల్లోకి రావాలని ఎంతగానో కోరుకుంటున్నారు. తాజాగా ఈమె సోషల్ మీడియాలో తరచుగా తన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను కాస్త ఆనందపరుస్తూ ఉంటుంది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఎంతో కాలం అవుతుంది. అందం , అభినయం ఉన్నప్పటికీ కూడా భావనకి అవకాశాలు రాలేదు. కానీ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ కూడ రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. దీంతో అభిమానులు కోరుకున్నట్టుగానే ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ ఏడాది ఈమె నటించిన రెండు చిత్రాలు కూడా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా రూపొందుతూ ఉండడంతో ఈ సినిమాకు సంబంధించి ఒక అధికార ప్రకటన మరో రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలోనే హీరోయిన్ భావన ఒక ట్రెడిషనల్ చీరకట్టులో కనిపించి అందరినీ ఆకట్టుకుంటోంది. రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి ఈ ముద్దుగుమ్మ. తిరిగి మళ్లీ అలాంటి అవకాశాలు రావాలని ఈమె అభిమానులు కోరుకుంటున్నారు.ఇక అభిమానులు కోరుకున్నట్టు భావన రీ ఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: