నానీ 'దసరా' మూవీ నుండి.. సర్ ప్రైజ్ వచ్చేసింది?
ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు నాచురల్ స్టార్ నాని దసరా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను తెగ ఆకర్షించింది. ఇక ఈ సినిమాలో నాని ఎంతో మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు అన్నది తెలుస్తుంది. అంతే కాదు తెలంగాణ లాంగ్వేజ్ లో నాని డైలాగులు చెప్పడం కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. ఇకపోతే ఇటీవలే నాని నటిస్తున్న దసరా మూవీ నుంచి ఒక వీడియోని విడుదల చేస్తూ చిత్ర బృందం అభిమానులందరికీ కూడా సర్ప్రైస్ చేసింది.
స్పార్క్ ఆఫ్ దసరా పేరుతో చిత్రయూనిట్ ఒక వీడియో ని విడుదల చేసింది. ఇక ఈ వీడియోలో నాని మాస్ లుక్ అదిరిపోయింది అని చెప్పాలి. ఇక నానీ లుక్ చూసిన తర్వాత ఈ సినిమా సూపర్ హిట్ కొట్టడం ఖాయం అని అటు అభిమానులు కూడా నమ్ముతూ ఉన్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని తో హిట్ పెయిర్గా గుర్తింపు సంపాదించుకున్న కీర్తిసురేష్ నటిస్తోంది. కాగా కీర్తి సురేష్ నాని కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా కావడం గమనార్హం. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు అని తెలుస్తోంది.