మెగాస్టార్
చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే, ఒక
సినిమా సెట్స్ పై ఉండగానే
మెగాస్టార్ చిరంజీవి మరో
సినిమా లైన్ లో పెడుతూ ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. అందులో భాగంగా
మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య
సినిమా షూటింగ్ పనులను దాదాపుగా పూర్తి చేశాడు, ఈ
సినిమా ఏప్రిల్ 29 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అఫీషియల్ గా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఆచార్య
సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం
గాడ్ ఫాదర్ , బోలా
శంకర్ , కె ఎస్
రవీంద్ర (బాబి) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు.