భర్త సినిమా అంటేనే నో అంటున్న విద్యాబాలన్ కారణం..?
ఇక అసలు విషయంలోకి వెళితే ఆమె తన భర్త సినిమాలో మాత్రం నటించడానికి ఒప్పుకోవట్లేదు.. ఈ విషయం గురించి విద్యాబాలన్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. విద్యాబాలన్ ప్రముఖ ప్రొడ్యూసర్ సిద్ధార్థ్ రాయ్ కపూర్ ను వివాహం చేసుకుంది . ఇక ఈయన బ్యానర్లో ఘన్ చక్కర్ అనే సినిమాలో విద్యాబాలన్ నటించింది. ఇక ఈ సినిమా తరువాత ఈమె తన భర్త బ్యానర్ లో ఒక్క రోజు కూడా ఒక సినిమాలో కూడా ఆమె నటించలేదు. ఇందుకు గల కారణం ఏమిటంటే విద్యాబాలన్ తన భర్త బ్యానర్లో తాను నటించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో ఇందుకు గల కారణాలు కూడా అభిమానులు వెతుకుతున్నారు.
అసలు విషయం ఏమిటంటే తన భర్త బ్యానర్ లో నటించి ఆ సినిమా మంచి విజయం సాధిస్తే ఆ క్రెడిట్ మొత్తం తన భర్త కి వెళ్తుంది అని.. తన విజయాలను ఎవరైనా తక్కువ చేసి చూపిస్తే తను తట్టుకోలేనని.. అందుకే తన భర్త బ్యానర్ లో నటించే ప్రసక్తే లేదని విద్యాబాలన్ తెలిపింది.ఇకపోతే ఈ స్టేజ్ కి రావడానికి తామిద్దరం ఎంతో కష్టపడ్డాము అని.. ఒకరి సక్సెస్ ప్రభావం మరొకరిపై పడకూడదు అని సొంత బ్యానర్ లో నటించడం లేదు అని ఆమె చెప్పింది.