తారక్ బామ్మర్ది కొత్త సినిమా ఫస్ట్ లుక్ విడుదల!

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది అయిన నార్నే నితిన్ చంద్ర హీరోగా పరిచయం కానున్నాడని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.ఇక హోళీ పండుగ సందర్భంగా నితిన్ డెబ్యూ మూవీని అధికారికంగా ప్రకటించడంతో పాటుగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా లాంచ్ చేశారు.ఇక ''శ్రీ శ్రీ శ్రీ రాజా వారు'' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాతో నార్నే నితిన్ తెరంగేట్రం చేయబోతున్నాడు. 'శతమానం భవతి' సినిమా డైరెక్టర్ సతీష్ వేగేశ్న ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.ఇక ఫస్ట్ లుక్ విషయానికి వస్తే.. ఇందులో నార్నే నితిన్ రఫ్ గడ్డంతో రగ్డ్ లుక్ లో కనిపిస్తున్నాడు. స్టయిల్ గా సిగరెట్ తాగుతూ నడుచుకుంటూ యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. ఈ లుక్ తోనే అతను ఇందులో మాస్ పాత్రలో కనిపిస్తాడని స్పష్టంగా అర్థం అవుతుంది.'శ్రీ శ్రీ శ్రీ రాజా వారు' విభిన్నమైన కుటుంబ కథా చిత్రమని సినీ వర్గాలు కూడా చెబుతున్నాయి.

టైటిల్ లోగోలోని అక్షరాలు సిగరెట్లను తలపించే విధంగా డిజైన్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నార్నే శ్రీనివాసరావు కుమారుడు ఇంకా తారక్ సతీమణి లక్ష్మీ ప్రణతి తమ్ముడైన నితిన్ హీరోగా లాంచ్ అవడానికి తగిన శిక్షణ కూడా తీసుకున్నారని సమాచారం తెలుస్తోంది.ఇక శ్రీ వేదాక్షర మూవీస్ బ్యానర్ పై చింతపల్లి రామారావు ఇంకా అలాగే ఎమ్.ఎస్ రెడ్డి సంయుక్తంగా 'శ్రీ శ్రీ శ్రీ రాజా వారు' సినిమాని నిర్మిస్తున్నారు. మలయాళ మ్యూజిక్ కంపోజర్ కైలాస్ మీనన్ ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు. దాము నర్రావుల ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇందులో నితిన్ సరసన కనిపించే హీరోయిన్ ఇంకా అలాగే ఇతర నటీనటులు వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.మరి హీరోగా తన బావ ఎన్టీఆర్ లాగా ఇతను కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: