రాధా
కృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్
రెబల్ స్టార్ ప్రభాస్,
పూజ హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం 'రాధేశ్యామ్'.
యువి క్రియేషన్స్ బ్యానర్పై రూపొందిన ఈ
సినిమా మార్చి 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. పాన్
ఇండియా లెవెల్ లో ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమాపై మొదట మిశ్రమ స్పందన వచ్చింది. కంప్లీట్
లవ్ స్టోరీగా వచ్చిన ఈ
సినిమా సూపర్ హిట్ అని కొందరు అంటుండగా.. మరికొందరు మాత్రం ప్లాప్
మూవీ అని అంటున్నారు. అయితే తాజాగా వివాదాల దర్శకుడు
రాంగోపాల్ వర్మ రాధేశ్యామ్ సినిమాపై పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఈ సినిమాకి
ప్రభాస్ రెమ్యునరేషన్ పక్కన పెడితే.. సినిమాకి అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదంటూ
వర్మ కామెంట్ చేశాడు.
ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ లో ఐదో వంతు లో రాధేశ్యామ్
సినిమా మొత్తం తీయవచ్చని చెప్పాడు. ఇటీవల ఓ
యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో
వర్మ మాట్లాడుతూ..' రాధేశ్యామ్ సినిమాకి
ప్రభాస్ రెమ్యునరేషన్ పక్కన పెడితే.. ఈ
సినిమా బడ్జెట్ విషయంలో 5 వ వంతులో
సినిమా తీయవచ్చు. రాధేశ్యామ్ లాంటి ఇంటెన్స్
లవ్ స్టోరీ అభిమానులకు విజువల్ ఫీస్ట్ అవసరం లేదు.
గీతాంజలి సినిమా మాదిరిగా మంచుకొండల్లోని లొకేషన్లో ఉంటే సరిపోతుంది. కథలోని భావోద్వేగం, భావాలను విజువల్ ఫీస్ట్ డామినేట్ చేస్తాయి. అసలైన స్టోరీని చంపేస్తాయి.
ప్రభాస్ సినిమా ఎలా ఉన్నా అభిమానులు ఆదరిస్తారు. విజువల్ ఫీస్ట్ వల్ల సినిమాకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేక పోయారు' అంటూ తెలిపాడు రాంగోపాల్ వర్మ. అంతేకాదు
సినిమా సెట్ ఆర్టిఫిషియల్ కావడంతో..
కథలోని పాత్రలు కూడా ఆర్టిఫిషియల్ అయిపోయాయి అని చెప్పాడు.
ఇక
బాలీవుడ్ మూవీ ది
కాశ్మీర్ ఫైల్స్ గురించి విడుదలయ్యే వరకు ఎవరికీ తెలియదని.. కేవలం 4 కోట్ల నుంచి 5 కోట్లతో ఈ సినిమాని రూపొందించారు. కానీ
సినిమా మాత్రం ఇప్పుడు వంద కోట్ల వసూళ్లు సాధించిందని తెలిపాడు. అయితే రాధేశ్యామ్
సినిమా బడ్జెట్ కి.మ్ వచ్చిన కలెక్షన్ కి అసలు పొంతనే లేదంటూ కామెంట్ చేశాడు వర్మ. ఇక
ప్రభాస్ నటించిన
బాహుబలి సినిమాకు పెట్టిన బడ్జెట్ కరెక్ట్ అని.. కానీ ఇప్పుడు అంత బడ్జెట్ అవసరం లేదని.. సినిమాకు భారీగా ఖర్చు చేసి ఆ సినిమాని ప్లాస్టిక్ చేస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు రాంగోపాల్ వర్మ...!!