ఆర్ఆర్ఆర్ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది..!

Pulgam Srinivas
ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా ఏదైనా సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా  ఎదురు చూస్తున్నారు అంటే అది కేవలం ఆర్ఆర్ఆర్ సినిమా కోసమే అని చెప్పడంలో ఏ మాత్రం వెనక డాల్సిన అవసరం లేదు, దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆలియా భట్ ,  ఒలీవియా మోరిస్ హీరోయిన్ లుగా డి వి వి దానయ్య నిర్మాతగా తెరకెక్కిన ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితం జనవరి 7 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది,  కాకపోతే ఈ మూవీ విడుదల సమయంలో దేశంలో కరోనా కేసులు  విజృంభించడంతో ఈ సినిమా విడుదలను చిత్ర బృందం వాయిదా వేసింది. అయితే కొన్ని రోజుల క్రితం ఈ సినిమా మార్చి 25 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది,  విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం ప్రస్తుతం మూవీ  ప్రమోషన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉంది.


 అందులో భాగంగా ఈ సినిమా విడుదలకు మిగిలి ఉన్న ఈ వారం రోజుల్లో చిత్ర బృందం ప్రమోషన్ లను అదిరిపోయే రేంజ్ లో ప్లాన్ చేసుకుంది, ఇది ఇలా ఉంటే తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా సెన్సార్ బోర్డు రిపోర్ట్ వచ్చేసింది.  ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్లు జారీ చేసింది,  ఇది ఇలా ఉంటే ఈ సినిమా రన్ టైం ను కూడా చిత్ర బృందం లాక్ చేసినట్లు సమాచారం,  ఆర్ఆర్ఆర్ మూవీ రన్‌ టైమ్ 3 గంటల 6 నిమిషాల 54 సెకన్లు అని సమాచారం. ఇది ఇలా ఉంటే ఎంతో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ లో అజయ్ దేవగన్ ,  సముద్ర కని ముఖ్య పాత్రల్లో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: