త్రివిక్రమ్ ను కోట్లతో ముంచేస్తున్న ఆ రెండు మార్గాలు !

Seetha Sailaja

న్యూక్లియర్ ఫిజిక్స్ చదువుకున్న ఒక వ్యక్తి మంచి రచయితగా మారడం ఒక సంచలనం అయితే అతడు వ్రాసిన కథలకు డైలాగ్స్ కు నిర్మాతలు కోట్లు కురిపిస్తూ ఉంటే సగటు ప్రేక్షకుడు అభినందనలతో అతడి డైలాగ్స్ కు ప్రశంసలు లభిస్తు ఉంటాయి. ఇండస్ట్రీలో మేధావిగా గుర్తింపు తెచ్చుకున్న త్రివిక్రమ్ తో సినిమాలు చేయడానికి టాప్ హీరోలు అంతా ముందువరసలో ఉంటారు.


ప్రస్తుతం అతడి మ్యానియా ఇండస్ట్రీలో బాగా తారా స్థాయిలో ఉండటంతో అతడు అనుసరిస్తున్న రెండు ఆదాయ మార్గాలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే కొంతమంది టాప్ హీరోల సినిమాలకు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలకు రచనా బాధ్యతను తీసుకుంటూ ఆ సినిమాల విజయానికి దోహద పడుతున్నాడు.


ఈమధ్య విడుదలైన ‘భీమ్లా నాయక్’ మూవీకి సంబంధించిన అన్ని విషయాలు తానై చూసుకున్నందుకు అతడికి 15 కోట్ల పారితోషికం లభించింది అంటారు. ఈసినిమాకు విపరీతమైన పేరు రావడంతో పవన్ సాయి ధరమ్ తేజ్ లు సముద్రఖని దర్శకత్వంలో నటిస్తున్న ఒక తమిళ రీమేక్ ను తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా మార్చే బాధ్యతను కూడ త్రివిక్రమ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారంమేరకు ఈసినిమాకు సంబంధించిన డైలాగ్స్ అదేవిధంగా స్క్రీన్ ప్లేను వ్రాయడానికి త్రివిక్రమ్ కు ఈమూవీ నిర్మాతలు 20 కోట్లు పారితోషికం ఇచ్చినట్లు వస్తున్న వార్తలు చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.


ఒక టాప్ హీరో పారితోషికం స్థాయిలో ఒక రచయితకు ఈ రేంజ్ లో పారితోషికం ఇవ్వడం చాలామందికి షాక్ ఇస్తోంది. త్రివిక్రమ్ మంచి రచయిత మాత్రమే కాకుండా మంచి మాటకారి మాటల మాంత్రికుడుగా పేరుగాంచిన ఇతడితో మాట్లాడటమే ఒక అదృష్టం అని చాలామంది భావిస్తూ ఉంటారు. వీలైనంత వరకు వివాదాల జోలికి వెళ్ళకుండా తనకు నచ్చిన టాప్ హీరోలతో మాత్రమే సినిమాలు చేసే త్రివిక్రమ్ మంచి చిన్నసినిమాను తీయమని చాలామంది అడిగినా నవ్వుతూ తప్పించుకుంటాడు..





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: