టాలీవుడ్ నటుడు సునీల్ రాజకీయాల్లోకి రాబోతున్నారని పవన్ కళ్యాణ్ పొలిటికల్ పార్టీ తరఫున ఆయన పోటీ కూడా చేయబోతున్నారని వార్తలు తెగ వచ్చాయి.
పవన్ పోటీ చేసి ఓడిపోయిన భీమవరం ప్రాంతం నుంచి సునీల్ పోటీచేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. సునీల్ పుట్టి పెరిగిందంతా కూడా భీమవరంలోనే.. అక్కడ ఆయనకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. పవన్ పార్టీ అంటే కచ్చితంగా జనసైనికుల సపోర్ట్ కూడా అంతే ఉంటుంది. దీంతో సునీల్ రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వడం ఖాయమని అనుకున్నారు అంతా.
తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారట సునీల్. తనకు రాజకీయాలపై అస్సలు టచ్ లేదని.. తను రాజకీయాలకు సరిపడే వ్యక్తిని కాదని చెప్పారట . కానీ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారంటే ఎంతో ఇష్టమని.. ఆయన నాకు బాగా క్లోజ్ అని చెప్పారు. ఆయనకి నిజంగానే తనను పార్టీలోకి తీసుకోవాలనుందని కానీ తనకు మాత్రం ఇష్టం లేదని చెప్పారట సునీల్. మన దగ్గర జనాభా ఎక్కువ అని ఫండ్స్ మాత్రం పెద్దగా ఉండవని చెప్పిన ఆయన.. ఈ ఫండ్స్ తో అందరికీ న్యాయం చేయలేమని అన్నారట.
న్యాయం జరగని వాళ్లు ఫీల్ అవుతారని ఈ ప్రాసెస్ లో మనం ఎవరినీ కూడా సంతృప్తి పరచలేమని అన్నారు. అన్నయ్య చిరంజీవి, కళ్యాణ్ గారు ఇద్దరూ ప్రోత్సహించడానికి రెడీగా ఉంటారని.. కానీ మనం వస్తే చప్పట్లు కొట్టి విజిల్స్ వేయాలి.. అలాంటి పరిస్థితి లేనప్పుడు బాధగా ఉంటుందని చెప్పారట.. అందుకే కళ్యాణ్ గారు అడిగినప్పుడు కూడా అదే చెప్పానని స్పష్టం చేశారట.. కళ్యాణ్ గారంటే చాలా ఇష్టమని.. ఆయనకు తనవంతుగా ఏదైనా చేయగలిగినప్పుడు మాత్రం తప్పకుండా తాను చేస్తానని..
కానీ అది రాజకీయంగా మాత్రం కాదని చెప్పారు. ఎందుకంటే తనకు రాజకీయం అంటే ఏంటో కూడా తెలియదని.. తను రాజకీయాలకు సూట్ అవ్వనని మరోసారి ఆయన తేల్చి చెప్పారు. సునీల్ మాటలను బట్టి ఆయనకు రాజకీయాలపై ఆసక్తి లేదనే విషయం అయితే క్లియర్ గా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన 'పుష్ప 2' సినిమాలో నటిస్తున్నారట.