మేనల్లుడితో కలిసి నటించబోతున్న పవన్...!!

murali krishna
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా బిజీగా ఉన్నారు. ఇటీవల భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఇటీవల రీమేక్ చిత్రాలు బాగా చేస్తున్నాడు.

సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన భీమ్లా నాయక్ అయితే బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది.

ఇప్పుడు భీమ్లా నాయక్ తర్వాత 'హరి హర వీర మల్లు' చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడట పవన్ కళ్యాణ్‌. దీని తర్వాత హరీశ్‌ శంకర్ దర్శకత్వంలో 'భవదీయుడు భగత్‌సింగ్' సినిమాను కూడా చేయాలి. కానీ దానికంటే ముందు 'వినోదయ సిత్తం' రీమేక్ మెదలుకానున్నట్లు సమాచారం.. దీనిపై ఆఫిషియల్ అనౌన్స్‌మెంట్ రాకముందే మరో చిత్రంకి సంబంధించి ఆసక్తికర వార్తలు కూడా బయటకు వస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ సుధీర్ వర్మతో కూడా ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం.. ఈ సినిమా లో వైష్ణవ్ తేజ్ తేజ్ కథానాయకడిగా నటించనున్నట్టు తెలుస్తుంది. త్రివిక్రమ్‌ సహ నిర్మాత గా వ్యవహరించనున్నాడు.దీనిపై త్వరలోనే క్లారిటీ కూడా రావలసి ఉంది. ఇదిలా ఉంటే వినోదయ సీతమ్ డైరెక్టర్ సముద్రఖని ఈ మూవీని తెలుగులో డైరెక్ట్ చేయనున్నాడని సమాచారం.. త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ కూడా చేస్తున్నారు. అయితే ఈ సినిమా కి పవన్ కేవలం 20 రోజులు మాత్రమే డేట్స్ కేటాయించారని, రెమ్యునరేషన్ ఏకంగా 60 కోట్లు అయితే తీసుకుంటున్నారట..

అంటే రోజుకు మూడుకోట్లు అన్నమాట.- ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ తీసుకున్న అత్యధిక రెమ్యూనరేషన్ ఇదే కావడం గమనార్హం. వినోదయ సీతమ్ రీమేక్‌లో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపించనున్నారని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ5తో కలిసి ఈ సినిమాని నిర్మించనుందని సమాచారం.ఈ సినిమా షూటింగ్ ఈ నెల 24న హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని తెలుస్తుంది. ఇందులో సాయి ధరమ్ తేజ్ కూడా మరో హీరోగా నటించనున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: