రామ్ చరణ్ తో సినిమా నా డ్రీమ్... గౌతమ్ తిన్ననూరి..!

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ లలో ఫుల్ బిజీగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే,  గత కొంత కాలం క్రితం  జనవరి 7 వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమాను విడుదల చేసే ఉద్దేశంతో చిత్ర బృందం ప్రమోషన్ లను నిర్వహించింది.  కాకపోతే అనూహ్యంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది,  ఇది ఇలా ఉంటే ఈ సినిమాను మార్చి 25 వ తేదీన భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.  ఇలా ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ప్రస్తుతం రామ్ చరణ్ ఈ సినిమా ప్రమోషన లలో పాల్గొంటున్నాడు,  ఇది ఇలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ ల తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,  శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక  భారీ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే.  


ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కూడా అయ్యింది,  ప్రస్తుతం కూడా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.   ఇలా ఒక భారీ పాన్ ఇండియా సినిమాను పూర్తి చేసి ప్రమోషన్ లలో పాల్గొంటున్న రామ్ చరణ్ మరో భారీ పాన్ ఇండియా సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు,  ఇది ఇలా ఉంటే రామ్ చరణ్,  శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటించబోతున్న విషయం మన అందరికి తెలిసిందే.బ్ వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్క బోతున్న ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన  కూడా కొన్ని రోజుల క్రితమే జరిగిపోయింది,  ఇది ఇలా ఉంటే తాజాగా గౌతమ్ తిన్ననూరి రామ్ చరణ్ సినిమా గురించి స్పందించాడు.  తాజాగా ఒక అభిమాని,  రామ్ చరణ్ తో మంచి సినిమా చేయాలి ఆయన క్యారెక్టరైజేషన్ అదిరిపోవాలి అని అభిమాని అడిగితే...  రామ్ చరణ్ తో మూవీ నా డ్రీమ్,  ఆయన మూవీ కోసం నా వైపు నుంచి ది బెస్ట్ ఇస్తాను అని గౌతమ్ తిన్ననూరి చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: