స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో 'సలార్' కూడా ఒకటి. అయితే కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో సలార్ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.అయితే ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతుండగా, ఈ చిత్రంలో అందాల భామ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇకపోతే ఆమె పాత్ర ఈ సినిమాలో చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది.ఇకపోతే తాజాగా ఈ సినిమాలో శృతి చేయబోయే పాత్రకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది.
అయితే సలార్ చిత్రంలో శృతి హాసన్ 'ఆద్యా' అనే పాత్రలో నటిస్తోంది. ఆమె ఈ సినిమాలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతుందట.అయితే ప్రభాస్ ఫ్లాష్‌బ్యాక్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఆమె బట్టబయలు చేసే పనిలో ఉంటుందట. ఇక ఇక్కడే హీరోకు సంబంధించిన కొన్ని నిజాలు తెలుసుకుని, అతడితో ప్రేమలో పడుతుందట ఈ బ్యూటీ.ఇక ఇలా ప్రభాస్ ఫ్లాష్‌బ్యాక్‌కు సంబంధించిన పూర్తి వివరాలను బయటకు లాగేందుకు శృతి ప్రయత్నిస్తుందట. కాగా , ఈ సినిమాలో కొన్ని హైవోల్టేజ్ యాక్షన్ సీన్స్‌లోనూ ఈ అమ్మడు తన సత్తా చాటనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలో ప్రభాస్ మాస్ లుక్‌లో కనిపిస్తుండగా, ఆయన పాత్రను చాలా పవర్‌ఫుల్ గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రయత్నిస్తున్నాడు.అయితే పూర్తిగా యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రానున్న సలార్ చిత్రం ప్రభాస్ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ మూవీ అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, విలక్షణ నటుడు జగపతి బాబు 'రాజమనార్' పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు నటి ఈశ్వరి రావు ప్రభాస్ తల్లిగా మనకు కనిపిస్తారు. కాగా హొంబాలే ఫిలింస్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు రవి బసూర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు...!!