పవన్ భగత్ సింగ్ సినిమా మొదలయ్యేది అప్పుడేనట..!!

Divya
పవన్ కళ్యాణ్ కూడా ఒకే సారి నాలుగు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. పవన్ కళ్యాణ్ వరసగా బ్యాక్ బ్యాక్ సినిమాలు చేస్తూ తన నటనపై దృష్టి సాధిస్తూ ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ సినిమా కోసం వెయిట్ చేస్తున్న దర్శకులు మాత్రం మరి ఇన్ని సంవత్సరాలు వేచి చూడాలంటే తప్పేలా లేదనిపిస్తోంది. కరోనా కారణంగా సెట్స్ పైన ఉన్న కొన్ని సినిమాలు ఆలస్యమవుతున్నాయి. దీంతో కరొనా కాస్త తగ్గడంతో పవన్ కళ్యాణ్ వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇక గత కొద్దిరోజుల క్రితమే బిమ్లా నాయక్ మూవీ విడుదలైనది. ఇక ఆ తరువాత చిత్రం హరి హరి వీరమల్లు సినిమా పైన దృష్టి పెట్టినట్లు సమాచారం.


అయితే కారణం ఏదైనా కావచ్చు కానీ హరీష్ శంకర్ తో సినిమా ని ముందుగా పూర్తి చేయాలని అనుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే హరీష్ శంకర్ సినిమా పై ఏవైనా పుకార్లు వచ్చాయి అంటే చాలు ఆయన కఠినంగా వ్యవహరిస్తారు. అయితే ఈ సినిమా కోసం భారీ సెట్లు వేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే అలా సెట్టింగ్ వేసి షూటింగ్ చేయడం వల్ల చాలా లేట్ అవుతుందని ఉద్దేశంతో ఒక ప్రముఖ దర్శకుడు కూడా ఈ సినిమాని సెట్స్ పైకి వెళ్లకుండా ఆ పడుతున్నారని వార్తలు బాగా వినిపిస్తున్నాయి.


అయితే హరీష్ శంకర్ ఈ మాటలన్నీ కొట్టిపారేస్తూ జూన్ నెలాఖరు నుండి పవన్ కళ్యాణ్ భగత్ సింగ్  సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని.. ఇందులో హీరోయిన్గా పూజాహెగ్డే నటిస్తోందని డైరెక్టర్ హరీష్ శంకర్ తెలియజేయడం జరిగింది. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే తన సినిమా పై వస్తున్న వార్తలను తిరస్కరించారు హరి శంకర్. అయితే పవన్ కళ్యాణ్ కొన్ని కమిట్మెంట్ వల్ల తన చిత్రం లేట్ అవుతోందని తెలియజేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: