ఆర్ఆర్ఆర్ రివ్యూ.. 3వేల కోట్లకు పైగా కలెక్షన్స్..

Satvika
బాహుబలి తర్వాత జక్కన్న తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్.. ఈ సినిమా మరో 8 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఈ సినిమా కోసం అభిమానులు వెయ్యి ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. దాదాపు మూడేళ్లకు పైగా ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటున్నారు. సినిమా పై అంచనాలు రోజు రోజుకు పెరిగి పోతూన్నాయి.వాయిదాల మీద వాయిదాలు పడటం కూడా ఇందుకు మరో ముఖ్య కారణం అని చెప్పవచ్చు.. మొత్తానికి అన్నీ అడ్డంకులు పోయి మార్చి 25 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.


ఈ సినిమాను తెరకెక్కించడానికి జక్కన్న ఎంత కష్ట పడ్డారో అందరికి తెలిసిన విషయం.. టాలివుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా ఈ సినిమా టాక్ కొనసాగుతోంది.. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తుంటుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంపైనా ఇవే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సాధించబోయే విజయం మీద ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేవు. క్రిటిక్స్ పరంగా ఈ సినిమా ఎంత కలెక్షన్స్ ను అందుకుంటుందో అనేది ఇండస్ట్రీలో భారీగా చర్చలు జరుగుతున్నాయి.. ఒక్కొక్కరూ ఒక్కో విధమైన కలెక్షన్స్ ను చెబుతున్నారు..


ఆర్ఆర్ఆర్' సినిమా గురించి డీఐ, కలరిస్ట్ శివకుమార్ మాట్లాడుతూ.. వెయ్యి సార్లు చూడాలనిపిస్తుంది. అంటూ ఆయన అనడం విశేషం.ఒక ప్రెక్షకుడిగా ఈ సినిమాను చూసి చాలా ఎమొషనల్ అయ్యాను. సీన్ సీను కు గూస్ బంప్స్ తెప్పిస్తుందని అన్నారు. భారతీయ సినీ చరిత్ర లో అత్యధిక వసూల్ రాబట్టడంతో ప్రపంచ రికార్డులను కూడా బ్రేక్ చెస్తుంది. 3000 ల కోట్లకు పైగా ఈ సినిమా కలెక్షన్స్ ను అందుకోవడం పక్కా అని ఆయన అన్నారు. కీరవాణి బీజీఎం కూడా సినిమాకు చాలా హైలైట్ అవుతుందని అన్నారు.మార్చి 24న ప్రీమియర్స్ పడనుండగా, ఆ సమయం అప్పటి నుండే ఆర్ఆర్ఆర్ సందడి మొదలు కానుంది. ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించేందుకు వీలుగా సరికొత్త టెక్నాలజీ జోడించారు.. 550 కోట్ల బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించారు. 860 కోట్ల బిజినెస్ చేసింది. రోజు రోజుకు కలెక్షన్స్ పెరగడం ఖాయం అని ఆయన అన్నారు. దీంతో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: