ఊపందుకుంటున్న "రాధే శ్యామ్" మూవీ...ఇక లెక్కలు మారేనా...!!!

VAMSI
ఈ నెల అనగా మార్చ్ 11 న విడుదలైన హీరో ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. భారీ అంచనాల నడుమ ఎంతో ఘనంగా రిలీజ్ అయిన ఈ సినిమా మిశ్రమ స్పందనను తెచ్చుకుంటూ స్లో స్లో గా ముందుకు సాగుతున్న తరుణంలో ఒక్కసారిగా ఈ మూవీ రిజల్ట్స్ మారుతున్నట్లు సమాచారం. మొదటి నాలుగు రోజులతో పోలిస్తే నిన్న చాలా ఎక్కువుగా కలెక్షన్ రాబట్టినట్లు సమాచారం. అంతేకాకుండా నేడు కూడా భారీగానే టికెట్లు బుక్ అయినట్లు తెలుస్తుంది. ఇక ఈ వారాంతరం లోపు ఈ కలెక్షన్ ఇంకా రెట్టింపు అయ్యే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా.

టాక్ మిశ్రమంగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో కలెక్షనులు మాత్రం బాగానే ఉంటున్నాయి. కాగా ఇపుడు ఈ సినిమా కలెక్షన్లు రెండింతలు పెరిగినట్లు తెలుస్తోంది. చూస్తుంటే ఈ చిత్రం ఇప్పుడు పుష్ప మ్యాజిక్ నే క్రియేట్ చేస్తుందేమో అనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ వార్త విన్న ప్రభాస్ అభిమానులు సంతోషం తో సందడి చేస్తున్నారు. మొదట్లో అనుకున్నట్టుగా ఇక ముందు అయిన 'రాధే శ్యామ్' మూవీ రికార్డు తిరగరాయలని అంచనాలను మించిన ఫలితాలను అందుకోవాలని ఆశిద్దాం. ఈ సినిమా కోసం డార్లింగ్ ప్రభాస్‌ అభిమానులు మాత్రమే కాదు ఆల్‌ ఇండియా మూవీ లవర్స్‌ అందరూ ఆత్రుతగా మూడేళ్లకు పైగానే ఎదురు చూశారు, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ బ్రేక్ చేయాలని కోరుకున్నారు....మరి ఇపుడు వారి కోరిక నిజమౌతుందో లేదో చూడాలి.  

మొదట భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 7010 స్క్రీన్స్‌లో ఈ సినిమా రిలీజైంది. పాటలు, టీజర్‌కు భారీ స్పందన రావడంతో సినిమా పై ఓ రేంజ్ లో హోప్స్ పెట్టుకున్నారు ప్రేక్షకులు...అయితే ఊహించిన స్థాయిలో సినిమా లేకపోవడం తో కాస్త నిరుత్సాహనికి గురి అయ్యారే తప్పా సినిమా బాగుందని అని చాలామంది అంటున్నారు. ఈ సినిమా చూడటానికి ప్రభాస్, పూజ హెగ్డే ల నటన ఒక్కటి చాలని అంతా అద్భుతంగా ఈ సినిమాలో వారి యాక్టింగ్ ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: