మళ్లీ పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఈసారి కూడా అతన్నే?
అంతే కాదు గ్లామర్ పాత్రల్లో కూడా నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది అనే చెప్పాలి. ఇక ఇటీవలే బాలీవుడ్ బ్యూటీ అమృత రావు తన పెళ్లి ఫోటోలను మొదటిసారిగా సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులందరినీ కూడా సర్ప్రైస్ చేసింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే అమృత రావు మరోసారి పెళ్లి చేసుకుంది. ఇంతకీ ఈ సారి ఎవరిని అనుకుంటున్నారా.. తన భర్తనే మరోసారి పెళ్లి చేసుకుంది ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ. అమృతకు ఆర్జె అన్మోల్ తో 2014లో రహస్య వివాహం జరిగింది. అయితే ఇది వరకే ఆర్జే అన్మోల్ ను రహస్య వివాహం జరిగినట్లు ఒక వీడియో ద్వారా ప్రకటించింది అమృత రావు.
ఇక ఇటీవల తన భర్తనే మరో సారి పెళ్లి చేసు కుంటూ తన పెళ్లి ఫోటోలను వీడియో రూపంలో బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ప్రస్తుతం ఈ సెలబ్రిటీ జంట కపుల్ ఆఫ్ థింగ్స్ అన్న యూట్యూబ్ చానల్ ద్వారా పలు విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. ఇటీవల తమ వివరాలను పంచుకున్నారు. తర్వాత ఇక ఇప్పుడు కుటుంబ సభ్యుల మధ్య ఈ జంట మళ్లీ పెళ్లి చేసుకోవడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇటీవల ఈ జంట విడుదల చేసిన వీడియోలో ఎన్నో మధురమైన క్షణాలను ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చింది. ఇక తమ కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపకుండా ఉండేందుకు రహస్యంగా 2014 మే 15వ తేదీన వివాహం చేసుకున్నాము ఈ సెలబ్రెటీ జంట తెలిపింది.