RRR: ఫ్యాన్స్ కి భారీ షాక్.. సినిమాలో ఆ పాటలు ఉండవట..?

Anilkumar
టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చిత్రం త్రిబుల్ ఆర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ లు పాటలు, ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని మెగా నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్తో దానయ్య ఈ సినిమాను నిర్మించారు.


ఇక ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి ఎత్తర జెండా అనే పాట విడుదల అయిన సంగతి తెలిసిందే. ఇక నిన్న ఈ పాట ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఇక ఈ పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్, ఆలియాభట్ ముగ్గురు కలిసి డాన్స్ స్టెప్పులు అదరగొట్టేసారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఈ పాట భారి రెస్పాన్స్ కనబరుస్తోంది. అయితే ఇది ఇలా ఉంటే ఈ పాట సినిమాలో ఉండదు అన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ పాటను కేవలం ప్రమోషన్స్ కోసమే వాడుతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.


ఈ పాట మాత్రమే కాదు ఇది వరకు ఈ సినిమా నుండి దోస్తీ అనే పాట విడుదల చేసిన విషయం తెలిసిందే కదా. ఈ పాటను కూడా సినిమా ప్రమోషన్ కోసమే ఉపయోగిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నిజానికి తాజాగా విడుదలైన ఎత్తర జెండా పాటను కంపోజ్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ లేనప్పటికీ విడుదల తేదీకి, సినిమా తీసే సమయానికి మధ్య సమయం ఉండడంతో ఈ పాటను కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. అయినా కూడా ఈ పాటను కేవలం ప్రమోషన్స్ కోసమే వాడుతున్నట్లు సమాచారం. ఇక ఈ వార్త తెలుసుకున్న అభిమానులు మాత్రం తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో నిజంగా ఈ పాటలు ఉండవా? అనేది తెలియాలంటే మార్చి 25 వరకు వేచి చూడాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR

సంబంధిత వార్తలు: