RRR: బుకింగ్స్ లో మరో సెన్సేషనల్ రికార్డ్..?

Anilkumar
టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ ఫిలిం 'త్రిబుల్ ఆర్'. దేశ వ్యాప్తంగా భారీ అంచనాలున్న ఈ సినిమా ఈ నెల 25న 14 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అగ్ర నిర్మాత డి.వి.వి.దానయ్య సుమారు ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం ఏకంగా మూడు సంవత్సరాలపాటు డేట్లు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్ కి నిర్మాత దానయ్య 45 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చాడని కూడా అంటున్నారు.


ఇక బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. నిజానికి గత సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా అప్పట్లో భారీ ఎత్తున ప్రమోషన్స్ కూడా చేశారు. అయితే దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ ఎఫెక్ట్ తో పాటు ఏపీలో టికెట్ రేట్లు మరీ తక్కువ కావడంతో సినిమాను వాయిదా వేశారు. ఇక అలా ఊరిస్తూ ఊరిస్తూ ఫైనల్ గా మార్చి 25న విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదలకు తొమ్మిది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదల కు ముందే రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ సెన్సేషన్ సృష్టిస్తోంది.


సినిమా రిలీజ్ కు 21 రోజుల ముందే బుకింగ్స్ స్టార్ట్ చేయగా.. అమెరికాలో అప్పుడే వన్ మిలియన్ డాలర్లు మార్క్ క్రాస్ చేసింది. ఇక తాజాగా ఇప్పుడు సరికొత్త రికార్డును అందుకుంది త్రిబుల్ ఆర్. తాజా సమాచారం ప్రకారం అమెరికాలో త్రిబుల్ ఆర్ 1.5 మిలియన్ డాలర్ మార్క్ కూడా క్రాస్ చేసేసిందట. ఇక విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో ఈ సినిమా రెండు మిలియన్ డాలర్ల దాటేసి, కేవలం అడ్వాన్స్ బుకింగ్ లతో 3 మిలియన్ల డాలర్లు దాటిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఈ బుకింగ్స్ చూస్తుంటే ఓవర్సీస్ లో త్రిబుల్ ఆర్ సినిమా కోసం జనాలు ఎంత ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారో అర్థం అవుతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR

సంబంధిత వార్తలు: