వైరల్ : గెటప్ శ్రీనుని జూ. కమల్ హాసన్ అని ఊరికే అనలేదు?

praveen
లోకనాయకుడు గా పేరు తెచ్చుకున్న కమలహాసన్ ఎంత గుర్తింపు సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక ఎలాంటి పాత్రలో నటించినా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ప్రాణం పోస్తూ ఉంటాడు కమలహాసన్. అందుకే కమల్ గొప్ప నటుడు అని అందరూ ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. అచ్చం ఇలాగే తెలుగు బుల్లితెర పై జూనియర్ కమల్ హాసన్ గా పేరు సంపాదించుకున్నాడు గెటప్ శ్రీను. జబర్దస్త్ అనే కార్యక్రమంలో ఒక సాదా సీదా కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ప్రతి ఎపిసోడ్ లో కూడా సరికొత్త గెటప్ తో ప్రేక్షకుల ముందుకు రావడం ఇక ఆ గెటప్ కి అతను తప్ప వేరొకరు సెట్ కారు అన్నంతగా అద్భుతంగా ఒదిగిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది


 దీంతో సాదాసీదా కమెడియన్ శ్రీను కాస్త కొన్ని రోజుల్లోనే గెటప్ శ్రీను గా మారిపోయాడు. ఇక ఎలాంటి గెటప్ వేసిన అతని కంటే బాగా ఇంకెవరూ చేయలేరు అని అనిపిస్తూ ఉంటుంది. ఆ రేంజ్ లో అతని విలక్షణమైన నటన ఉంటుంది అని చెప్పాలి. ఇలా తన నటనతో రోజురోజుకీ అభిమానులను మరింత పెంచుకుంటూ పోతున్నాడు గెటప్ శ్రీను. ఇటీవలే మరోసారి తన నటనతో తనను అభిమానులు అందరూ జూనియర్ కమల్ హాసన్ అని ఎందుకు పిలుస్తారు అని నిరూపించాడు . ఇటీవలే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలయింది.


 ఇక ఈ ప్రోమో లో భాగంగా సురభి నాటకాలు వేసే ఎంతోమంది నటులు స్టేజి మీదికి వస్తారు. మొదట ప్రోమో అంతా సందడి సందడి గానే సాగిపోతూ ఉంటుంది. అయితే ఆ తర్వాత గెటప్ శీను ఒక స్పెషల్ పర్ఫామెన్స్ చేస్తాడు. నాటకాలనే నమ్ముకున్న వారు నేటి రోజుల్లో ఎన్ని  ఇబ్బందులు పడుతున్నారు అని తన పెర్ఫార్మెన్స్ తో చూపిస్తాడు. ఇక నాటకాలు వేస్తే కడుపు నిండదు అని భావించి సినిమా లోకి వెళ్లాలని అనుకుంటాడు. డైరెక్టర్గా చేసిన బుల్లెట్ భాస్కర్ నీకేం వచ్చు చూపించు అని అడగడంతో.. నవరసాలను చేసి చూపిస్తాడు. ఇదంతా చూసిన తరువాత గెటప్ శ్రీను కంటే గొప్పగా ఎవరు నవరసాలను చేసి చూపించ లేరేమో అని అనిపిస్తుంది చూసేవాళ్ళకి. అందుకే గెటప్ శ్రీను ని జూనియర్ కమలహాసన్ అని అంటారు అంటూ కొంతమంది అభిమానులు కామెంట్లు పెడుతూనే ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: