రెండు భారీ డిజాస్టర్స్ నుండి తప్పించుకున్న వెంకీమామ..!

Anilkumar
సినిమా ఇండస్ట్రీలో  చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి అయితే అందులో కొన్ని సంఘటనలు చూస్తే గనక డెస్టినీ నిజమే అని అనిపిస్తూ ఉంటుంది.ఇకపోతే ఒక్కోసారి కొన్ని సినిమాల స్క్రిప్టులు ఒక హీరోతో చేయాలనుకున్నా అవి మరో హీరో ఒడిలో చేరిపోతాయి.అయితే ఆ సినిమాలు హిట్ అయితే, ఆ సినిమాలను తిరస్కరించిన హీరోలు ఆ బ్లాక్ బస్టర్ లను చేజార్చుకున్నందుకు పశ్చాత్తాపపడతారు. ఇక మరి వాళ్ళు రిజెక్ట్ చేసిన సినిమాలు డిజాస్టర్ అయితే. ఇప్పుడు సీనియర్ హీరో వెంకటేష్ విషయంలో అలాగే జరిగింది.అయితే  ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన రెండు బోరింగ్ చిత్రాల నుండి వెంకటేష్ తప్పించుకున్నాడు.


ఇక  ఆ రెండు సినిమాలు ఏంటంటే. “రాధే శ్యామ్”, “ఆడవాళ్లు మీకు జోహార్లు”.అయితే దర్శకుడు కిషోర్ తిరుమల మొదట్లో వెంకటేష్‌తో “ఆడవాళ్లు మీకు జోహార్లు” సినిమా చేయాలని ప్లాన్ చేశారు. ఇకపోతే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరిగాయి. అయితే  కొన్ని కారణాల వల్ల వెంకటేష్ ఈ ప్రాజెక్ట్ నుండి వెనక్కి తగ్గాడు. ఇక చివరికి కిషోర్ ఆ సినిమాను శర్వానంద్ తో చేశాడు. అయితే ఎట్టకేలకు “ఆడవాళ్లు మీకు జోహార్లు” చిత్రం గత వారం తెరపైకి వచ్చి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.కాగా  “రాధే శ్యామ్‌”ని కూడా ముందుగా వెంకటేష్ చేయాలనుకున్నారు.అయితే  మొదట ఈ సినిమా అసలు ఆలోచనతో చంద్రశేఖర్ యేలేటి వెంకీ మామను కలిశాడట.


ఇకపోతే కొన్ని తెలియని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఇక ఆ తర్వాత రాధాకృష్ణ కుమార్ అదే ఐడియాని తీసుకుని ప్రభాస్ కోసం డెవలప్ చేశాడు. అయితే మార్చ్ 11న వెండితెరపైకి వచ్చిన “రాధేశ్యామ్”కు ఓ మోస్తరు రెస్పాన్స్ వస్తోంది. ఇకపోతే వెంకటేష్ అదృష్టవశాత్తూ ఈ రెండు సినిమాల నుండి తప్పించుకున్నాడన్నమాట. ఇక పప్రస్తుతం వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎఫ్3 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: