"రాధేశ్యామ్": ప్రేమకథలను కమర్షియల్ గా చూడకండి... ?
కృష్ణం రాజు చెప్పిన ప్రకారం ఈ సినిమాను మరే ఇతర కమర్షియల్ సినిమాల్తో పోల్చుకుని చూడడం తగదని తెలిపారు. అయితే వాస్తవంగా చూస్తే ఈ సినిమా కథ ఒక ప్రేమకథ. ఇంతకు ముందు ప్రభాస్ నుండి వచ్చిన బాహుబలి సిరీస్ కావొచ్చు, అలాగే గత సంవత్సరం ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫెయిల్ అయిన "సాహో" కావొచ్చు. వీటికంటే భిన్నమైన కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా "రాధే శ్యామ్". ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టమే. అయితే రిలీజ్ రోజు నుండి నేటికి సినిమా చూసిన వారిలో ఎక్కువగా యువతే ఉందన్నది కాదనలేని వాస్తవం.
మరి ఇప్పటి వరకు సినిమా వర్గాల నుండి కావొచ్చు, లేదా ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు వస్తున్న నెగటివ్ స్పందనకు ఎవరూ కారణం కాదు. మళ్ళీ మెల్ల మెల్లగా కలెక్షన్ లలో వేగం వస్తుందని సినిమా బృందం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలం తర్వాత ఒక వినూత్నమైన, ప్రేమకథను అందించారు అని ఒక వర్గం ప్రేక్షకులు అనుభూతి చెందుతున్నారు.