షాక్: హీరో విశాల్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు.. కారణం ఏమిటంటే..!!

Divya
కోలీవుడ్ స్టార్ హీరో మరొకసారి చిక్కుల్లో పడ్డారు.. తాజాగా మద్రాస్ హైకోర్టులో విశాల్ కు చుక్కెదురైంది.. కేవలం మూడు వారాల గడువు లోపల కోర్టు రిజిస్ట్రేషన్ జనరల్ పేరిట.. రూ.15 కోట్ల రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని హీరో విశాల్ కు మద్రాసు హైకోర్టు తెలియజేసింది.. లైకా సంస్థ నుంచి తీసుకున్న డబ్బుని డిపాజిట్ చేయాలని హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా విశాల్ అభిమానులు షాక్ కు గురయ్యారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.


హీరో విశాల్ లైకా సంస్థ దగ్గర కొద్దిగా డబ్బులు అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకుండా తన కొత్త సినిమా విడుదల తేదీని ప్రకటించడానికి సిద్ధమయ్యారని  లైకా సమస్త ఆరోపిస్తోంది.. ఇక అంతటితో ఆగకుండా హీరో విశాల్ తమకు వడ్డీతో సహా రూ.21 .69 కోట్ల రూపాయల్ని కట్టాలని కోర్టుని కోరడం జరిగింది. దాఖలు చేసిన ఈ పిటిషన్ పై జస్టిస్  సెంథిల్ కుమార్ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులను కూడా జారీ చేయడం జరిగిందట. దీంతో విశాల్ రూ.15 కోట్ల రూపాయలను హైకోర్టు ప్రధాన రిజిస్ట్రేషన్ బ్యాంకు పేరున 21 రోజుల లోపు డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఇక తదుపరి విచారణ ఈనెల 22వ తేదీకి వాయిదా వేసినట్లుగా సమాచారం.


విశాల్  లైకా ఒప్పందం ప్రకారం తమ డబ్బులు ఇవ్వకుండా.. వీరమే వాగై సుడుం చిత్రాన్ని విడుదల చేయడానికి శాటిలైట్, ఓటిటి హక్కులను విక్రయించడానికి పాల్పడినట్లుగా సమాచారం.. వాటిపై నిషేధం విధించాలని ఆ సమస్త మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో హైకోర్టు జస్టిస్ సెంథిల్ కుమార్ ఈ కేసును విచారించడం జరిగింది. ఇక హీరో విశాల్ లైకా ప్రొడక్షన్ వారికి రూ.21.29 కోట్ల రూపాయల మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని అగ్రిమెంట్ లో ఉన్నట్లుగా తెలియజేశారు న్యాయమూర్తి. మొదటిసారిగా విశాల్ రూ. 12 కోట్లు తీసుకోగా ఆ తర్వాత రూ.3 కోట్లు తీసుకున్నారని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: