ఓటిటిలో వలిమై.. వసూళ్ల ప్రభావమా?

Purushottham Vinay
తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ అయిన వలిమై సినిమా బాక్సాఫీస్ వద్ద అంతకు మించిన వసూళ్లు రాబడుతుందని అంతా కూడా భావించారు. కాని ఆశించిన స్థాయిలో వసూళ్లు నమోదు కాలేదు అనేది కోలీవుడ్ ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట.వలిమై సినిమాలో తెలుగు యంగ్ హీరో కార్తికేయ కీలక పాత్ర లో నటించడం వల్ల టాలీవుడ్ లో కూడా మంచి హైప్ క్రియేట్ అయ్యింది. కానీ సినిమా రిలీజ్ సమయం లో జనాలు మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. తెలుగులో ఈ సినిమాకు చాలా తక్కువ వసూళ్లు మాత్రమే నమోదయ్యాయి.ఇక అందుకు కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా అని కూడా  ఒక ప్రచారం జరుగుతోంది. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సన్నివేశాలను ఈ సినిమాలో డైరెక్టర్ వినోద్ హెచ్ చూపించే ప్రయత్నం చేశాడు.బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బోనికపూర్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో అజిత్ యాక్టింగ్ మరో సారి ఆయన అభిమానులకు కన్నుల విందు చేసింది.



ఈ సినిమాలో హీరోయిన్ గా హ్యుమా ఖురేషి నటించగా..అజిత్ కుమార్ పోలీస్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ గురించి ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను జీ 5 వారు కొనుగోలు చేశారు.వారు ఈ సినిమాను థియేటర్ లో రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం చేసుకున్నారని సమాచారం తెలుస్తోంది. గత నెల చివర్లో విడుదల అయిన ఈ సినిమాను ఈనెల 25 వ తేదీన భారీ ఎత్తున ఒకే సారి అన్ని భాషల్లో స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం తెలుస్తోంది. అన్ని భాషల్లో కూడా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: