బాక్సింగ్ రింగ్ లో అడుగుపెట్టిన సూర్య హీరోయిన్..!!

Divya
సినిమా కోసం ఎంతోమంది నటీనటులు తమకు తాము మార్చుకుంటూ తమ కెరీర్ ని ముందుకు సాగిస్తూ ఉంటారు. హీరోలకు దీటుగా వర్కౌట్లు వ్యాయామాలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు హీరోయిన్స్. ఇక ఇప్పుడు అలాంటి వారి బాటలోనే మలయాళం కుట్టి అపర్ణ కూడా అదే పనిలో ఉన్నది.. ఈమె సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమాతో మొదటిసారిగా ప్రేక్షకులను బాగా అలరించింది. ఇక ఆ సినిమాలో ఈమె మాటలకు నటనకు మంత్రముగ్ధులు అయ్యారు ప్రేక్షకులు. దీంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఇప్పుడు ఆ తర్వాత తన రెండవ సినిమా కోసం సన్నద్ధమవుతోంది.. కాగా ఈ చిత్రం కోసం ఏకంగా బాక్సింగ్ నేర్చుకుంటోంది. అపర్ణ తన ట్రైనర్స్ సహాయంతో బాక్సింగ్ లోని కొన్ని టిప్స్ ను నేర్చుకుంటున్న ట్లుగా ఒక వీడియో ద్వారా తెలియజేసింది. ఈ వీడియో చాలా వైరల్ గా మారుతోంది. ఈ వీడియోకి గ్లోవ్స్ ఎమోజి ని ట్యాగ్ చేస్తూ షేర్ చేసింది. ఈ వీడియో చూసిన ఎంతోమంది నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు సైతం కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియో చూసిన కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి కూడా తను కూడా బాక్సింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను అని రిప్లై ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

అపర్ణ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నిథం ఓరు వానమ్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాని తెలుగులో ఆకాశం అనే పేరుతో విడుదల చేయబోతున్నారు. ఇందులో అపర్ణ తో పాటుగా హీరోయిన్ రీతూ వర్మ, మరొక హీరోయిన్ శివాత్మిక కీలకమైన పాత్రలలో నటిస్తున్నారు. ఇక మలయాళంలో కూడా సుందరి గార్డెన్ అనే సినిమా షూటింగ్ లో పాల్గొన బోతుంది. ఇక ఇందులో నీరజ్ మాధవ్ ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఇక వీరితో పాటుగా కార్తి, ఉన్ని ముకుందన్ వంటి హీరోలు కూడా  ఈ సినిమాలో  నటిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: