వామ్మో: మహేష్ సినిమాలో బాలయ్య బాబు ఎన్ని నిమిషాలు ఉంటారంటే..!!

Divya
ప్రస్తుతం రాజమౌళి దృష్టి అంతా ఎక్కువగా rrr సినిమా ప్రమోషన్స్ మీదనే పెట్టారు. ఇక ఈ సినిమా కోసం అభిమానులు కూడా దాదాపుగా నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు ఈ సినిమాని ఈ నెల 25న విడుదల చేస్తున్నారు. దీంతో తన తదుపరి సినిమా పైన ప్రస్తుతం ప్రేక్షకులలో చాలా ఆతృతగా ఉందని చెప్పవచ్చు..RRR మూవీ తర్వాత మహేష్ బాబు తో రాజమౌళి ఒక సినిమా చేస్తున్నారని వార్తలు బాగా వినిపించాయి. ఇక అందుకు సంబంధించి కొన్ని పనులు కూడా జరుగుతున్నట్లు తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా అప్పుడప్పుడు ట్విట్టర్ లో తెలియజేస్తూ ఉన్నాడు.

ఈ చిత్రం ఆసియా బ్యాక్ డ్రాప్ లో నే జరిగే టువంటి అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ఉంటుందని గతంలో ఒక ప్రకటన కూడా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక మహేష్ కూడా సర్కారు వారి పాట సినిమా ను పూర్తి చేయాలనే అంశంతో చాలా బిజీగా సూచన చేస్తున్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే త్రివిక్రమ్ తో సినిమా మొదలు పెట్టనున్నట్లు సమాచారం. ఈ సినిమాను ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత త్వరగా రాజమౌళితో సినిమాలో నటించాలని ఆలోచిస్తున్నట్లుగా సమాచారం.


ఇదంతా ఇలా ఉండగా తాజాగా.. మరొక ఆసక్తికరమైన వార్త బాగా వినిపిస్తున్నది.. అదేమిటంటే ఇందులో బాలకృష్ణ నటించబోతున్నారు అన్నట్లుగా సమాచారం. అది కూడా ఒక గెస్ట్ రోల్ కింద ఈ సినిమాలో హీరో నిమిషాల పాటు బాలయ్య కనిపించబోతున్నట్లు వార్త వినిపిస్తోంది.. దీంతో బాలయ్య అభిమానులు కాస్త ఖుషి అవుతున్నారు. ఇక తమ అభిమాన హీరోని రాజమౌళి డైరెక్షన్లో చూడగలుగుతున్నాం అని ఫ్యాన్స్ చాలా సంబరపడిపోతున్నారు. మరి ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే. ఈ విషయాన్ని రాజమౌళి, చిత్రబృందం అధికారికంగా తెలుపుతుందేమో  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: