అభిమానుల ఉత్సాహంతో రాజమౌళి లో కలవరపాటు !
‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ విడుదలకు కౌంట్ డౌన్ ప్రారంభం కావడంతో చరణ్ జూనియర్ ల అభిమానులలో రోజురోజుకి అత్యుత్సాహం పెరిగిపోతోంది. మితిమీరిన ఉత్సాహంతో సోషల్ మీడియాలో చరణ జూనియర్ ల అభిమానులు తమ హీరో వల్ల మాత్రమే ‘ఆర్ ఆర్ ఆర్’ ఘనవిజయం సాధిస్తుందని తమ హీరో ముందు మరే టాప్ హీరో సరిపోడు అంటూ మాటల దాడి సోషల్ మీడియాలో మొదలు పెట్టాడు.
వాస్తవానికి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ కథ ఒక కల్పిత కథ అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ ఒక అజ్ఞాత ప్రదేశంలో కలిస్తే ఏమౌతుంది అన్న ఊహ చుట్టూ ఈ మూవీని తాను తీసినట్లు రాజమౌళి అనేకసార్లు స్పష్టమైన క్లారిటీ ఇస్తున్నాడు. అంతేకాదు తన మూవీలో చరణ్ జూనియర్ లు కనిపించరనీ వారి పాత్రలు మాత్రమే కనిపిస్తాయని చరణ్ జూనియర్ ల హీరో ఇమేజ్ ని తాను పట్టించుకోలేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.
అయితే ఈ విషయాలు చరణ్ జూనియర్ అభిమానులకు పూర్తిగా అర్థం అయినట్లు అనిపించడం లేదు. దీనితో తమ హీరో గొప్పతనం వలన మాత్రమే ఈ మూవీ హిట్ అవుతుందని ప్రచారం మొదలు పెట్టాడు. దీనికితోడు ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించే ఆలోచన కూడ రాజమౌళి విరమించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వేలాది సంఖ్యలో ఈ ఈవెంట్ కు చరణ్ జూనియర్ అభిమానులు రావడమే కాకుండా ఒకరి పై ఒకరు డామినేట్ చేసుకోవడానికి ‘చరణ్ జిందాబాద్-జూనియర్ జిందాబాద్’ అంటూ స్లొగన్స్ మొదలుపెడితే ఈ అనవసరపు రగడకు ‘ఆర్ ఆర్ ఆర్’ ఈవెంట్ కేంద్రంగా మారుతుందని భావించి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈనెల 18వ తారీఖున దుబాయ్ లో ఘనంగా నిర్వహించి ఆ కార్యక్రమ లైవ్ టెలికాస్ట్ అన్ని భాషల ఛానల్స్ లోను ప్రసారం అయ్యే విధంగా రాజమౌళి ప్లాన్ మార్చుకున్నట్లు తెలుస్తోంది..