అఖిల్ 'ఏజెంట్' రిలీజ్ డేట్ ఫిక్స్ ఎప్పుడంటే..?

Anilkumar
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఏజెంట్'. గత ఏడాది బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో కెరీర్ లో మొదటి సక్సెస్ అందుకున్న అఖిల్ ఇప్పుడు అదే సక్సెస్ ను మెయింటైన్ చేయాలి అని చూస్తున్నాడు.ఈ నేపథ్యం లోనే ఏజెంట్ రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటివరకు లవర్ బాయ్ గా ఆడియన్స్ ని అలరించిన అఖిల్ తొలిసారి ఫుల్ లెంత్ యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు. ఇప్పటికే ఏజెంట్ సినిమాకు సంబంధించి అఖిల్ మోషన్ పోస్టర్లకు భారీ రెస్పాన్స్ రావడంతో పాటు ఆ పోస్టర్లు ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెంచాయి. 


కండలు తిరిగిన దేహం సిక్స్ ప్యాక్ బాడీతో అఖిల్ ని చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఇక చాలా రోజుల నుంచి షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా విడుదల తేదీ పై ఎట్టకేలకు చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తూ అధికారిక ప్రకటన చేసింది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను ఆగస్టు 12, 2022 న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా తెలిపింది. ఈ మేరకు ఓ సరికొత్త పోస్టర్ కూడా విడుదల చేశారు మేకర్స్. ఇక ఈ పోస్టర్ లో అఖిల్ గన్ చేతిలో పట్టుకొని చాలా వైల్డ్ గా కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో అఖిల్ కు జోడిగా సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తోంది. 


ఓ కీలక పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇటీవల తమన్ సంగీతం అందిస్తున్న సినిమాలన్నీ దాదాపు మంచి విజయాలు అందుకుంటూ ఉండడంతో ఏజెంట్ మ్యూజిక్ పై కూడా ఆసక్తి నెలకొంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తో కలిసి దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక అఖిల్ తన కెరీర్ లోనే పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంలో నటిస్తుండటంతో అందరి దృష్టి ఇప్పుడు ఈ సినిమా పైనే ఉంది. మరి ఈ సినిమాతో అఖిల్ ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి...!!



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: